ఆకాశాన్ని తాకే కొండలు.. క్రూర మృగాలు సంచరించే అటవీ ప్రాంతం... నరమానవుడు కనిపించని చోటు.. అంతటి ఎత్తైన ప్రాంతంలో వెలసి ఉంది ఓ ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడికి చేరుకోవడమే ఓ సాహసం. ఇదేదీ.. అక్కడి ప్రజలను ఆపలేదు. ఆ ఆలయంలో పూజారి చేసే సాహసాన్ని అడ్డుకోలేదు. శ్రావణ మాసం వచ్చిందంటే.. ఆ కొండపై నిత్యం జాతరే. స్వామికి పూజారి చేసే సాహసం అయితే, హాలీవుడ్ సినిమాల్లోనూ మనం చూసి ఉండం. ఆకాశానికి సమానంగా ఉన్నట్లుగా కనిపించే నున్నటి కొండపై వందల ఏళ్లుగా పారుతున్న దీపపు నూనె ధారాలు, దీనికి తోటు వర్షం నీరు పారిన పాచి చారల మీదుగా పూజారి ఎలాంటి సహాయం లేకుండా కిందకు దిగి హారతి ఇచ్చే కార్యక్రమం... ఒక సాహాసోపేతమైన అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం అక్కడ జరిగే పండుగను చూసేందుకు వేలాదిగా తరలివస్తారు. ఎంతో కష్టమైనా.. వృద్ధులు, చిన్న పిల్లలు శుక్రవారం రాత్రికే అక్కడికి చేరుతారు.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ఈ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రను ఈటీవీ భారత్ ప్రత్యేకంగా చిత్రీకరించింది. ఆ విశేషాలు మీ కోసం.
ఇదీ చూడండి- గాంధీ-150: అక్షర సైనికుడిగా మహాత్ముడి ముద్ర