తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల రెండు కిలోమీటర్లమేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా...టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 1 లక్షా 372 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం 3.17 కోట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి.. కన్నుల పండువగా.. పశువుల పండుగ