US TELUGU 1
అమెరికా హోంల్యాండ్ విభాగం అదుపులో ఉన్న భారతీయ విద్యార్థుల భవితవ్యం నేడో రేపో తేలనుంది. బోగస్ వర్సిటీలో విద్యార్థులను చేర్పించిన ఎనిమిది మంది దళారులను అరెస్టు చేశారు. వారందరు తెలుగువారే కావడం గమనించాల్సిన అంశం.
అమెరికాలో సుమారు 12 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా.. వారిలో దాదాపు 2.27 లక్షల మంది భారతీయ విద్యార్థులే. వీరిలో అమెరికాలోనే స్థిరపడాలని వెళ్లిన వారే అధికం. రెండేళ్ల చదువు.. మూడేళ్ల ఓపీటీ పూర్తైన తర్వాత తాత్కాలిక వీసాలు రాకపోవడంతో...అక్కడే ఉండేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చదువు కోసం కాకుండా... కేవలం అమెరికాలో కొనసాగేందుకే... హోంల్యాండ్ విభాగం సృష్టించిన యూనివర్సిటీలో చేరారు. పోలీసుల అదుపులో ఉన్న సుమారు 600 మంది విద్యార్థులను విచారణ అనంతరం తప్పు చేసినట్లు రుజువైతే వెంటనే స్వదేశానికి పంపించనున్నారు.