కరోనా సోకిన వారికి ఆక్సిజన్ అవసరమైతే తక్షణమే ఏర్పాటు చేస్తామని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఆపదలో ఉన్నవారికి ప్రత్యేకంగా సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టకు చెందిన షబ్బీర్‌కు ఆక్సిజన్ సిలిండర్ అందజేశారు. కరోనా బాధితులకు ఆర్థిక సాయం కావాలంటే తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నీటిసరఫరాకు చర్యలు చేపట్టండి

నీటి సరఫరాను మరింత మెరుగుపరిచే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పద్మారావు గౌడ్ అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రియాంక, స్రవంతి సీతాఫల్ మండిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని అధికారులకు ఉపసభాపతి సూచించారు. కార్యక్రమంలో జీఎం రమణ రెడ్డి, డీజీఎం కృష్ణ, కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు.