తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని ఉపసభాపతి టి.పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. భాజపా జాతీయ నాయకులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ వంటి హేమాహేమీలు వచ్చినా గ్రేటర్లో తెరాస గెలుపును అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని సీతాఫల్మండీలో తెరాస మహిళ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీ దేవిని గెలిపించుకోవాలని పద్మారావు గౌడ్ కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, తెరాస నేతలతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. మొదటి ప్రాధాన్యత ఓటును తెరాస అభ్యర్థికి వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దివాకర్ రావు, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీతా, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నేతలు మోతె శోభన్ రెడ్డి, కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, పరిశీలకులు శ్రీనివాస్, శ్రీకాంత్, జలంధర్ రెడ్డి, రాజ సుందర్, యువ నేతలు కిశోర్ కుమార్, టి.రామేశ్వర్, త్రినేత్ర గౌడ్, ప్రతినిధులు పాల్గొన్నారు.