కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. శుక్రవారం సితాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ముషీరాబాద్, మారేడుపల్లి, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన రూ.2కోట్లకు పైగా విలువ చేసే.. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని పేర్కొన్నారు. ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారంగా మారకూడదనే షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన ఘటన కేసీఆర్‌దేనని కొనియాడారు.
- ఇదీ చదవండి : మధ్యాహ్నం 3 గంటల నుంచి వెబ్సైట్లో 'పది' ఫలితాలు