ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది కృషి అభినందనీయమని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని పారిశుద్ధ్య సిబ్బందికి ఫ్రెండ్లీ వెల్ఫేర్ సర్వీస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పండ్లు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారని, వారిని ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష