సికింద్రాబాద్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఉపసభాపతి పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 140 మంది లబ్ధిదారులకు రూ. కోటీ 19 లక్షల విలువైన చెక్కులను అందించారు. పేద వర్గాలకు వివాహం భారం కాకూడదనే ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందువరసలో ఉందన్నారు.
ఇవీ చూడండి: 'ఆంధ్రాలో ఉద్యోగాలిస్తే.. ఇక్కడ గొర్రెలు, బర్రెలిస్తున్నారు'