సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఉపసభాపతి పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. రూ.5 లక్షల విలువైన చెక్కులు అందించారు. తెలంగాణలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి పరంగా సికింద్రాబాద్‌ను అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: డీసీపీ అవినాష్ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు