ETV Bharat / state

అపోహలు వీడండి.. టీకా వేయించుకోండి: ఉప సభాపతి

సికింద్రాబాద్​ పరిధిలోని మెట్టుగూడ ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి పద్మారావు గౌడ్​ ప్రారంభించారు. తొలి దశలో కరోనా యోధులకే వ్యాక్సిన్​ ఇస్తున్నామన్న ఆయన త్వరలోనే ప్రజలందరికీ టీకాను​ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

deputy  speaker padmarao call for  let go of the myths  for vaccinated of corona
అపోహలు వీడండి.. టీకా వేయించుకోండి: ఉప సభాపతి
author img

By

Published : Jan 18, 2021, 3:46 PM IST

అనవసరమైన అపోహలు వీడి ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడానికి ముందుకు రావాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్​ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్​ నియోజకవర్గం పరిధిలోని మెట్టుగూడ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చిందని పద్మారావు గౌడ్​ అన్నారు. తొలి దశలో వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు టీకా ఇస్తున్నామన్న ఆయన ఆ తర్వాత ప్రజలందరికీ వ్యాక్సిన్​ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ ఉప కమిషనర్​ మోహన్​రెడ్డి, వైద్యఆరోగ్య శాఖ అధికారులు శ్రీమతి సక్కుబాయి, డాక్టర్ యాదయ్య, కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.