సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మంచినీటి ఎద్దడిని పూర్తిగా నివారించగలిగామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సివరేజ్ సమస్యలను సైతం శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో రూ. 34 లక్షల ఖర్చుతో వివిధ ప్రాంతాల్లో సివరేజ్, మంచి నీటి పైప్ లైన్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు.
ఉప్పరి బస్తీలో రూ. 11 లక్షల ఖర్చుతో, బీదల బస్తీలో రూ. 18 లక్షలు, ఎరుకల బస్తీలో రూ. 4.85 లక్షల ఖర్చుతో సివర్ లైన్ మంచినీటి లైన్ పనులను ఉప సభాపతి ప్రారంభించారు. ఇటీవల కాలంలో రూ. 10 కోట్ల నిధులను సేవర్ లైన్‌ల మార్పిడికి వినియోగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జల మండలి జీఎం రమణా రెడ్డి, కార్పొరేటర్ కుమారి శామల హేమ, తెరాస యవ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చనిపోయిన ఏనుగు కోసం.. రాత్రంతా పొలంలోనే గజరాజుల తిష్ఠ!