సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అంబర్ నగర్, చంద్రబాబు నాయుడు నగర్ (తార్నాక, లాలాపేట) ప్రాంతాల్లో వర్షాలతో ఇబ్బంది పడిన బాధితులకు శాసనసభ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు ఉచితంగా 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెరాస యువనేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి