రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకి నిరసనగా 3 రోజుల పాటు విధులను బహిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 4, 5, 6వ తేదీలు సంతాప దినాలు పాటించడంతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ దుశ్చర్యను ఖండిచాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్య పట్ల రేణుకా చౌదరి దిగ్భ్రాంతి