ETV Bharat / state

మొబైల్‌ టవర్ల రేడియేషన్ నిజంగా ప్రమాదకరమా?

author img

By

Published : Oct 15, 2019, 9:46 AM IST

Updated : Oct 15, 2019, 10:37 AM IST

టెలికాం రంగంలో సెల్‌ టవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో టవర్లు ఉన్నాయి. నగరాల్లో ఎత్తైన భవనాలపైన ఎక్కడ పడితే అక్కడ ఈ స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటి నుంచి వచ్చే రేడియేషన్​పై ప్రజల్లో పలు అనుమానాలున్నాయి. స్తంభాలను తొలగించాలనే నిరసనలను తరచూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. మరోవైపు సిగ్నల్స్‌ అందడం లేదనే ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. అసలు మొబైల్‌ టవర్ల నుంచి ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో వికిరణం వెలువడుతోందా? డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డీవోటీ) ఏటా చేసే తనిఖీల్లో ఏం తేలింది? అన్న సందేహాలను హైదరాబాద్‌  డీవోటీ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌  కె.రాంచంద్‌  ఇలా తీర్చారు.

సెల్​ఫోన్​ టవర్‌.... వద్దు భయం...!

చరవాణి నుంచి రేడియేషన్‌ వెలువడుతుందని.. గరిష్ఠంగా 1.6 వాట్‌ ఫర్‌ కేజీగా నిర్దేశించిందని రాంచంద్​ తెలిపారు. దీనికి లోబడే చరవాణులను తయారు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 2 వాట్‌ ఫర్‌ కిలో వరకు అనుమతిస్తున్నారన్నారు. మీ ఫోన్లలో ఏ స్థాయిలో రేడియేషన్‌ ఉందో *#07# ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.

  1. ఫోన్​లో గరిష్ఠంగా 1.6 వాట్​ ఫర్​ కేజీ
  2. ప్రపంచవ్యాప్తంగా 2 వాట్​ ఫర్​ కిలో
  3. *#07# ఈనంబర్​ను మొబైల్​లో ప్రెస్​ చేసి రేడియోషన్​ ఎంత ఉందో తెలుసుకోవచ్చు

ఫోన్‌లో రేడియేషన్‌ పరిమితి ఎలా లెక్కిస్తారు..?

సెల్‌ టవర్ల పౌనఃపున్యం 900, 1800, 2100, 2300 మెగాహెడ్జ్‌ వరకు ఉంటున్నాయని రాంచంద్​ తెలిపారు. స్తంభాలకు 50 మీటర్ల దూరం నుంచి రేడియేషన్‌ పరీక్షించినప్పుడు చదరపు మీటర్‌కు ఒక వాట్‌ వరకు ఉండొచ్చుని అంటున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయోనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌(ఐసీఎన్‌ఐఆర్‌పీ) నిర్దేశించిన ప్రమాణాల్లో పదో వంతుని స్పష్టంచేశారు. ఇప్పటివరకు డీవోటీ తనిఖీల్లో పరిమితికి లోబడి ఉన్నట్లు తేలిందన్నారు. కాబట్టి టవర్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.

స్తంభాల నుంచి వెలువడే రేడియేషన్‌ నిజంగా ప్రమాదకరమా?

రేడియేషన్‌ తీవ్రతను బట్టి అయోనైజింగ్‌, నాన్‌ అయోనైజింగ్‌ అని రెండుగా విభజించారని పేర్కొన్నారు. అయోనైజింగ్‌ వికిరణం ప్రమాదకరమని.. ఎక్స్‌రే, గామా కిరణాలు దీని కిందకు వస్తాయని అంటున్నారు. అందుకే ఎక్స్‌రే తీసేటప్పుడు ఆ ప్రభావం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నాన్‌ అయోనైజింగ్‌ కిందకు ఎఫ్‌ఎం రేడియోలు, టీవీలు, చరవాణులు, విద్యుత్తు బల్బులు, రాడార్లు, రిమోట్‌, సూర్యకిరణాలతో పాటు సెల్‌ స్తంభాలు కూడా వస్తాయని తెలిపారు. ఇవి శరీరానికి హాని చేయవని.. సూర్యుడి నుంచి వెలువడే వాటిలో అల్ట్రావైలెట్‌ కిరణాలు ప్రమాదకరమని తెలిపారు. దీని నుంచి రక్షణగా లేపనాలు(లోషన్లు) రాసుకుని బయటకు వెళుతుంటామన్నారు. అదే విధంగా సెల్‌ స్తంభాల నుంచి రక్షణగా డీవోటీ ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఎమిషన్స్‌పై కొన్ని పరిమితులు విధించిందని వివరించారు.

ఈ కథనం చదవండి: పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా... జర భద్రం

Last Updated : Oct 15, 2019, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.