ETV Bharat / state

DENGUE: రాజధానిలో చాపకింద నీరులా డెంగీ, మలేరియా

కరోనా పూర్తిగా అదుపులోకి రాకముందే రాజధానిలో డెంగీ(Dengue) చాపకింద నీరులా విస్తరిస్తోంది. వర్షాకాలంలో డెంగీ, మలేరియా జ్వరాలు సాధారణమే. జ్వరం వచ్చిన వెంటనే చాలామంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారు. నెగెటివ్‌గా తేలితే సాధారణ జ్వరమే అనుకుంటున్నారు. అలా తేలిగ్గా తీసుకోవడానికి లేదని, రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెంగీ విషయంలో జాప్యం చేస్తే రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు.

dengue alert
రాజధానిలో డెంగీ కలకలం
author img

By

Published : Jun 30, 2021, 9:21 AM IST

  • అమీర్‌పేటలో ఉండే రాజేష్‌(32) సెక్యూరిటీ గార్ఢు పగలు, రాత్రి ఆరు బయటే కాపలా కాయాలి. వారం క్రితం జ్వరం, తలనొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. జ్వరం తగ్గక పోవడంతో వైద్యుణ్ని సంప్రదించాడు. పరీక్షలు చేయకుండా సాధారణ జ్వరమేనని మాత్రలు ఇచ్చారు. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోగా.. ఎక్కువైంది. మరో వైద్యుడి సూచనతో రక్త పరీక్షలు చేయించుకోగా డెంగీ(Dengue) నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చేరేలోగా ప్లేట్‌లెట్లు భారీగా పడిపోయాయి.
  • వృద్ధుడి(60)కి జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. ఇంట్లోనే ఉండిపోయారు. జ్వరం తగ్గక పోవడంతో క్లినిక్‌లో చూపించుకున్నారు. రక్తపరీక్షలు చేయించగా...ప్లేట్‌లెట్లు 40 వేలకు తగ్గినట్లు తేలింది. డెంగీ (Dengue)సోకినట్లు గుర్తించి, వెంటనే ఆసుపత్రిలో చేరారు.

హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు 40 డెంగీ(Dengue) కేసులు నమోదయ్యాయి. జ్వరంతో వచ్చే ప్రతి 10 మందిలో కనీసం ఇద్దరిలో ప్లేట్‌లెట్ల తగ్గుదల గమనించామని ఓ ప్రైవేటు వైద్యుడు తెలిపారు. ఉస్మానియా, నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రుల్లోనూ డెంగీ లక్షణాలతో పలువురు చేరుతున్నారు.

దోమ కాటు నుంచి తప్పించుకోండిలా..

  • పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • ఇంట్లో పూల కుండీలు, కూలర్లు, నీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేసి ఆర బెట్టుకోవాలి. వారంలో ఒక రోజు డ్రైడే(Dry Day)గా భావించాలి.
  • డెంగీ కారక దోమలు ఇళ్లల్లో మూలలు, తలుపు, కిటికీల తెరల్లో దాగి ఉంటాయి. సాయంత్రం వేళల్లో ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండడం వల్ల కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేయాలి. దోమ తెరలు, దోమలను తరిమేసే మందులు వాడాలి.
  • పిల్లలకు కాళ్లు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలి. స్థానికంగా డెంగీ(Dengue), మలేరియా జ్వరాలు నిర్ధారణ అయితే అప్రమత్తంగా కావాలి. జ్వరం వస్తే రక్తపరీక్షలు చేయించుకోవాలి.

తేడా గమనించాలి

డెంగీ లక్షణాలు: తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్లు కదపలేని పరిస్థితి, శరీరంపై ఎర్రటి పొక్కులు. శరీరంలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్స్‌లెట్స్‌ ఉంటాయి. 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

మలేరియా లక్షణాలు: చలిజ్వరం, తలనొప్పి, వాంతులతోపాటు తీవ్ర నీరసం వస్తుంది. సాయంత్రం వేళల్లో ఎక్కువగా జ్వరం వస్తుంది. చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేస్తే మెదడు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది.

  • డెంగీ, మలేరియా వచ్చిన వారిలో సాధారణంగా దగ్గు, జలుబు లాంటివి ఉండవు. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గవు. బీపీ తగ్గిపోతుంది. పల్స్‌ రేటు హెచ్చుతగ్గులు కన్పిస్తాయి. జ్వరంతోపాటు కీళ్ల, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటే గన్యా కావచ్చు.

ఇదీ చూడండి: కొవిడ్ బాధితుల్లో కొత్త ఇన్​ఫెక్షన్​.. ఒకరు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.