ETV Bharat / state

వడ్డెర సంఘం భవనం కూల్చివేత.. అడ్డుకోబోయిన సంఘం నేతలు - telangana news

హైదరాబాద్‌ అత్తాపూర్‌లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ వడ్డెర సంఘం భవన నిర్మాణం చేపట్టారంటూ అధికారులు కూల్చివేశారు. అధికారులను వడ్డెర సంఘ అధ్యక్షులు వేముల వెంకటేశ్‌ అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Demolition of Vadera community building
వడ్డెర సంఘం భవనం కూల్చివేత
author img

By

Published : Apr 12, 2021, 5:32 PM IST

రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని జాతీయ వడ్డెర సంఘం భవనాన్ని... పోలీసు బందోబస్తు సహాయంతో బీసీ సంక్షేమ శాఖ, రెవెన్యూశాఖ అధికారులు కూల్చివేశారు. సర్వే నంబర్ 366లో 650 గజాల స్థలాన్ని వడ్డెర సంఘం కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే స్థలంలో నిర్మించిన భవనాలు ప్రైవేటు ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు రావటంతో కూల్చివేశారు.

అధికారులు తీరును వడ్డెర సంఘ అధ్యక్షులు వేముల వెంకటేశ్‌ వ్యతిరేకించారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: 'అవసరమైతే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.