ETV Bharat / state

CSE BRANCH: మొదటి ప్రాధాన్యం సీఎస్​ఈ... 95.56 శాతం భర్తీ - సీఎస్​ఈ విద్యార్థులు

కళాశాల ఎక్కడుందో పట్టించుకోలేదు... విద్యా నాణ్యత చూడలేదు... సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచిల్లో సీటు అయితే చాలు... విద్యార్థులు మొదటి ప్రాధాన్యంగా ఎంసెట్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఫలితంగా వాటిల్లో 95.56 శాతం సీట్లు నిండాయి.

CSE BRANCH
సీఎస్​ఈ
author img

By

Published : Sep 19, 2021, 10:29 AM IST

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద కంప్యూటర్‌, ఐటీ బ్రాంచిల్లో మొత్తం 38,796 సీట్లుండగా... వాటిల్లో 37,073 విద్యార్థులకు దక్కాయి. కేవలం 1,723 మిగిలాయి. ఎంసెట్‌ కమిటీ శనివారం మొదటి విడత సీట్లను కేటాయించింది. అన్ని బ్రాంచిల్లో కలిపి సగటున 82.27 శాతమే భర్తీ కావడం గమనార్హం. ‘‘అత్యధికంగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమల్లోనే కొలువులు ఉన్నాయి. మిగిలిన ఏ బ్రాంచ్‌ చదివినా చివరకు ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి కారణాలతో విద్యార్థుల్లో ఎక్కువ మందికి మొదటి ప్రాధాన్యం సీఎస్‌ఈ బ్రాంచ్‌నే అయ్యింది’’ అని నిపుణులు చెబుతున్నారు. ఈసారి 31 కళాశాలల్లో అన్ని సీట్లూ నిండాయి. ఒక్కరూ చేరని కళాశాలలు ఏమీ లేవు. మొదటి విడతలో సీట్లు పొందిన వారు ఈనెల 23 లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5,108 మందికి సీట్లు

తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం సీట్లను సూపర్‌న్యూమరరీ కింద కేటాయించారు. మొత్తం 7,400 ఉండగా 5,108 మందికి సీట్లు దక్కాయి.

18 బ్రాంచీల్లో

34.83 లక్షల వెబ్‌ ఆప్షన్లు

ఎంసెట్‌లో ఈసారి విద్యార్థులు పెద్ద ఎత్తున వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. గత ఏడాది వరకు దాదాపు 24-25 లక్షల ఆప్షన్లు ఇచ్చుకునేవారు. ఈసారి ఆ సంఖ్య 34,83,650కి పెరిగింది. ఆప్షన్లపై కొంత అవగాహన పెరిగిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

సీట్ల భర్తీ

సీట్ల కేటాయింపు... గణాంకాలు ఇవీ...

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులైనవారు: 1.21 లక్షల మంది
  • ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారు: 71,216
  • వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన వారు: 69,793
  • బీటెక్‌లో కన్వీనర్‌ కోటా సీట్లు: 74,071(175 కళాశాలలు)
  • సీట్లు పొందిన వారు: 60,941
  • 100 శాతం భర్తీ అయిన కళాశాలలు: 31(అందులో 25 ప్రైవేట్‌వి)
  • మిగిలిపోయిన సీట్లు: 13,130
  • ర్యాంకుకు తగ్గట్లు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోకపోవడం వల్ల సీట్లు దక్కనివారు: 8,624
  • బీఫార్మసీ, ఫార్మా డి సీట్లు పొందిన వారు: 228(3,971 సీట్లు మిగిలిపోయాయి)

ఇదీ చూడండి: Traffic Restrictions : హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ రోడ్లు క్లోస్ చేశారు? ఏఏ దారులు మళ్లించారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.