రోడ్డు పక్కన పురిటినొప్పులు అనుభవిస్తూ రక్తపు మడుగులో ఉన్న ఓ యాచకురాలికి అప్పటికప్పుడే 108 సిబ్బంది ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు. అనంతరం కార్వాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యలు వెల్లడించారు. లంగర్‌హౌజ్ బాపూఘాట్ వద్ద రోడ్డు పక్కన 25 సంవత్సరాల వయసున్న కవిత అనే యాచకురాలు పురిటి నొప్పులతో తల్లడిల్లుతోంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన తరలివచ్చేసరికి అప్పటికే ఆమె రక్తపు మడుగులో ఉంది. అత్యవసరంగా నలుగురు మహిళల సాయంతో చెట్టు కిందనే ఆమెకు పురుడు పోశారు. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచింది. అనంతరం తల్లీబిడ్డను కార్వాన్‌లోని పాణిపుర అర్బన్ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ఇవీచూడండి: 2020 నాటికి సున్నా స్థాయికి భూగర్భజలాలు