Delhi Liquor scam updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం, తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసు దిల్లీకి చెందినప్పటికీ, దర్యాప్తు మాత్రం తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కుంభకోణంలో మరో కీలక పరిణామం జరిగింది. గతనెల 17న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌కు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రాబిన్ గుప్తా లేఖ రాశారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న విమానయాన సంస్థ వివరాలను అందులో కోరింది. జెట్ సెట్ గో విమానయాన సంస్థ సీఈవోగా కనికా టేక్రివాల్ వ్యవహరిస్తున్నారు. జెట్ సెట్ గో పేరుతో చార్టర్డ్ విమానాలు నడుపుతున్నారు. ఈడీ విచారణలో భాగంగానే ఈ సంస్థ విమాన సర్వీసుల రాకపోకల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. దిల్లీ మద్యం కుంభకోణంలో రూ.కోట్లు చేతులు మారినట్లు ఈడీ భావిస్తుంది. కనికాకు చెందిన విమానాల్లో నగదు తరలించినట్లు అభిప్రాయపడింది. సంస్థ ఏర్పాటు నుంచి నడిపిన అన్ని విమానాల వివరాలు, విమాన మేనేజర్లు, ప్రయాణికుల వివరాలు ఇవ్వాలని కోరింది. పీఎంఎల్‌ఏ విచారణలో భాగంగా వివరాలు కోరుతున్నట్లు ఈడీ వెల్లడించింది.
అసలేం జరిగదంటే: ఇప్పటికే దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, మరో నిందితుడు బినోయ్‌బాబుకు.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వారంరోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా, కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన కీలక విషయాలను ఈడీ వెల్లడించింది.
దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్‌చంద్రారెడ్డే కీలక సూత్రధారని.. మొత్తం మార్కెట్‌లో 30శాతానికిపైగా దక్కించుకోవడంతో పాటు, దక్షిణాది రాష్ట్రాల నుంచి టెండర్లు చేజిక్కించుకున్నవారితో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఈడీ పేర్కొంది. బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా 9 రిటైల్ జోన్స్ దక్కించుకున్నారని, అందుకోసం భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలిపింది. సౌత్ గ్రూప్‌కు సంబంధించి 100 కోట్లు.. విజయ్‌నాయర్ ద్వారా ముడుపులు చెల్లించినట్లు తెలిపింది.
ఇవీ చదవండి: దిల్లీ లిక్కర్ స్కామ్.. బయటపడుతున్న అరబిందో శరత్ చంద్రారెడ్డి లీలలు
ఈడీ కస్టడీకి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు..
'రాష్ట్రంలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకరించింది'
తెరుచుకున్న శబరిమల ఆలయం.. 41రోజుల పాటు మండల పూజ.. భారీగా భక్తుల తాకిడి!