ETV Bharat / state

Nizamabad Woman Case: 'దిల్లీ వంటి నగరంలో పట్టపగలే ఇంత అరాచకమా?'

author img

By

Published : Apr 20, 2022, 7:35 AM IST

ఆశ్రమంలో బందీగా ఉందంటున్న యువతిని విడిపించాలని కోరుతూ నిజామాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి, మీనావతి దంపతులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ నవీన్‌ చావ్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

High Court
High Court

ఆశ్రమంలో బందీగా ఉందంటున్న యువతిని ఆమె తల్లిదండ్రులతో ఏకాంతంగా సమావేశపర్చాలని దిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దిల్లీ వంటి నగరంలో పట్టపగలే ఇంత అరాచకమా అని ప్రశ్నించింది. అమెరికాలో పీహెచ్‌డీ చేసిన తమ కుమార్తె సంతోష్‌ రూప దిల్లీలోని వీరేంద్రదేవ్‌ దీక్షిత్‌ ఆశ్రమంలో బందీగా ఉందని.. ఆమెను అక్కడి నుంచి విడిపించాలని కోరుతూ నిజామాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి, మీనావతి దంపతులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ నవీన్‌ చావ్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ.. ‘‘వెన్నునొప్పితో బాధపడుతూ ఆశ్రమంలో ఉన్న వారి కుమార్తెను కలవాలని తల్లిదండ్రులు కోరుతున్నా.. నిర్వాహకులు అంగీకరించడం లేదు. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం పేరుతో ఆశ్రమం నడుపుతున్న వీరేంద్రదీక్షిత్‌ పదికిపైగా కేసుల్లో నిందితుడు. ఆయనపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఆశ్రమంలోని పరిస్థితులపై 2018లో హైకోర్టు నియమించిన కమిటీ సైతం అక్కడ పశువుల కొట్టంలో ఉన్న పరిస్థితులే ఉన్నాయని తెలిపింది. అక్కడ చాలా మంది మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లుగా ఉందని పేర్కొంది’’ అని వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. ‘‘దిల్లీ వంటి నగరంలో పట్టపగలే ఇటువంటి అర్థంలేని కార్యకలాపాలు సాగినిస్తారా? దీక్షిత్‌ పరారీలో ఉన్నప్పుడు ఆశ్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు’’ అని ప్రశ్నించింది. తామంతా కలిసే ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నామని పిటిషనర్ల కుమార్తె సంతోషి రూప పేర్కొంటున్నారని న్యాయవాది తెలిపారు. స్పందించిన ధర్మాసనం దిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిధిలోకి ఆ ఆశ్రమాన్ని ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ ఆశ్రమానికి, సంయుక్తంగా నిర్వహించుకుంటున్నామని చెబుతున్న పిటిషనర్‌ కుమార్తెకు నోటీసులు జారీచేసింది. ఆ యువతిని తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి : పోర్న్ చిత్రాల్లో నటించిందని అనుమానం.. భార్య దారుణ హత్య

కేంద్రం తిరోగమన విధానాలు అవలంభిస్తోంది: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.