ETV Bharat / state

ఆ ఒక్క ఉత్తర్వు ఆలస్యం.. 11 వేల పోస్టులకు ప్రకటనపై ప్రభావం - Delay in Telangana Teaching Posts Notification

Delay in TS Teaching Posts Notification due to Technical Issue : రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఉద్యోగ ప్రకటనలకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి గురుకుల నియామక బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించి దాదాపు నెల రోజులు దాటింది. బీసీ గురుకుల సొసైటీ నుంచి ప్రతిపాదనలు ఆలస్యం కావడంతో ప్రకటనల జారీలో జాప్యం జరుగుతోంది.

Telangana Teaching Posts Notification
Telangana Teaching Posts Notification
author img

By

Published : Dec 18, 2022, 6:45 AM IST

Delay in TS Teaching Posts Notification due to Technical Issue : రాష్ట్రంలోని గురుకులాల్లో దాదాపు 11 వేలకు పైగా ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల ఉద్యోగ ప్రకటనలకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గురుకుల నియామక బోర్డుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ సొసైటీలు.. జోన్లు, మల్టీజోన్ల వారీగా ప్రతిపాదనలు సమర్పించి దాదాపు నెల రోజులు దాటింది. అయితే బీసీ గురుకుల సొసైటీ నుంచి ప్రతిపాదనలు ఆలస్యం కావడంతో ప్రకటనల జారీలో జాప్యం జరుగుతోంది.

Delay in Telangana Teaching Posts Notification : బీసీ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరంలో మంజూరైన నాలుగు జూనియర్‌ కళాశాలలు, 33 గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కళాశాలల్లో 2,591 పోస్టులకు సీఎం, మంత్రి మండలి ఆమోదం లభించినప్పటికీ ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నేపథ్యంలో బీసీ గురుకుల సొసైటీ సిద్ధం చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. ఉద్యోగ ప్రకటన ఆలస్యమైతే, వచ్చే విద్యాసంవత్సరానికి సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంటుందని సంక్షేమ సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

నాలుగేళ్లుగా బోధన సిబ్బంది కొరత: రాష్ట్రంలోని గురుకులాల్లో దాదాపు 5 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే గురుకుల బోర్డుకు అనుమతి ఇచ్చింది. వీటిలో బీసీ గురుకుల సొసైటీలోనే 3 వేలకు పైగా పోస్టులున్నాయి. అయితే రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల సాంకేతిక కారణాలతో ఉద్యోగ ప్రకటన ఆలస్యమైంది. దాదాపు నాలుగేళ్లుగా అతిథి ఉపాధ్యాయులు, అధ్యాపకుల సహాయంతో సొసైటీలు బోధన కొనసాగిస్తున్నాయి.

ప్రస్తుతమున్న ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంజూరు చేసిన 9,096 పోస్టులు, అదనంగా అనుమతిచ్చిన మరో 2,591 పోస్టులకు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తిచేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి పోస్టులు భర్తీచేయాలని సొసైటీలు భావిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.