ETV Bharat / state

చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

ప్రతిష్టాత్మక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలో అక్రమాలకు తెరలేపారు. ఇవాళ జరగబోయే పరీక్షను ముందు రోజు రాత్రే అక్రమంగా ఓ ప్రైవేటు పాఠశాలలో రాస్తూ అడ్డంగా దొరికారు. విద్యార్థుల నుంచి వేలకొద్దీ డబ్బులు దండుకుంటున్న నిర్వాహకుల ఆగడాలతో రగిలిన ఓ విద్యార్థి మీడియాను ఆశ్రయించగా 'చీకట్లో చూచిరాత' బాగోతం బట్టబయలైంది.

degree-and-pg-exams-copying-found-at-jagadgiri-gutta
చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌
author img

By

Published : Dec 14, 2019, 9:15 AM IST

Updated : Dec 14, 2019, 1:18 PM IST

పర్యవేక్షణ లేమితో నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షలు గాడితప్పాయి. హైదరాబాద్ జగద్గిరిగుట్ట సక్సెస్ క్రియేటివ్ పాఠశాలలో ఏకంగా ఈరోజు జరగబోయే పరీక్షను ముందు రోజు రాత్రే అక్రమంగా నిర్వహిస్తూ అడ్డంగా దొరికారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చీకట్లో చూచిరాతలు యథేచ్చగా జరగడం గమనార్హం.

మీడియాను చూసి నీళ్లు నమిలిన నిర్వాహకులు

200 మందికిపైగా విద్యార్థులు దర్జాగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా విద్యార్థులు మీడియాకు సమాచారం అందించారు. కెమెరాలను చూసిన నిర్వాహకులు నీళ్లు నమిలారు. సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకోగానే భయంతో పలువురు విద్యార్థులు పారిపోయారు.

గ్యారంటీ పాస్​ కోసమే మాస్ కాపీయింగ్

నాగార్జునవర్సిటీ దూర విద్యా కేంద్రం నుంచి స్టడీ సెంటర్‌గా అనుమతులు తీసుకున్న గీతాంజలి కళాశాల యాజమాన్యం సక్సెస్ క్రియేటివ్ స్కూల్‌లో పరీక్ష నిర్వహించింది. గ్యారెంటీగా పాస్ చేయిస్తామని ఒక్కో విద్యార్థి నుంచి వేల రూపాయలు దండుకుని మాస్‌ కాపీయింగ్‌ని ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

అదుపులోకి కళాశాల ప్రతినిధి

ఇదే తరహాలో ఎల్బీనగర్, రామాంతపూర్, ఎస్సార్​నగర్, జగద్గిరిగుట్ట కేంద్రాలుగా అడ్డగోలు వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. గీతాంజలి జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రతినిధి బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

అందరిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

విద్యను వ్యాపారంగా మార్చి అనర్హులను అందలం ఎక్కించి విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్న వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వివిధ కేంద్రాల్లో సాగుతున్న అక్రమాల నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్‌

ఇదీ చూడండి : రామోజీ ఫిల్మ్‌సిటీలో 'శీతాకాల సంబురాలు'

TG_HYD_11_14_MASS_COPYING_PKG_3182400_TS10011 note: ఫీడ్ WRAP నుంచి వచ్చింది. ( చీకట్లో చూచిరాత) ( )ఈ రోజు జరగబోయే పరీక్షను ముందు రోజు రాత్రే అక్రమంగా ఓ ప్రవేటు పాఠశాలలో రాయిస్తూ కేటుగాళ్ళు అడ్డంగా దొరికారు. ప్రతిష్టాత్మక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయం పేపరునే వక్రమార్గంలో విద్యార్థుల నుంచి భారీగా డబ్బలు గుంజి సామాన్య విద్యార్థులకే టోకరా వేస్తున్నారు...ఇది తెలిసి కడుపు రగిలిన ఓ విద్యార్థి ఈటీవీ ఆశ్రయించారు....ఆ అక్కడికి చేరుకున్న ఈటీవీ బృందాన్ని చూసి షాక్ అయ్యారు నిర్వాహకులు..ఇంతకీ ఆ ప్రభుద్దులు ఎవరు... వాయిస్ హైదరాబాద్ జగద్గిరిగుట్ట లోని సక్సెస్ క్రియేటివ్ పాఠశాల లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం డిగ్రీ పీ.జీ. పరీక్షలను శుక్రవారం రాత్రి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండగా అడ్డంగా బుక్కయ్యారు. సుమారు 200కు పైగా హాజరైన విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న స్థానికులు, విద్యార్థులు మీడియాకి సమాచారం అందిచారు. అక్కడ మీడియా ను చూసిన నిర్వాహకుడు నీళ్ళు నమిలాడు...సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకోగానే భయంతో పలువురు విద్యార్థులు గోడదూకి పారిపోయారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం నుండి స్టడీ సెంటర్ గా అనుమతులు తీసుకున్న గీతాంజలి జూనియర్ కాలేజీ యాజమాన్యం తన కాలేజీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం లోని సక్సెస్ క్రియేటివ్ స్కూల్ లో మాస్ కాపీయింగ్ కోసం పూర్తి ఏర్పాటు చేసి శుక్రవారం రాత్రి పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాలేజీ యాజమాన్యం దూరవిద్యా కేంద్రం నుండి డిగ్రీ పీజీ కోర్సుల్లో గ్యారెంటీగా పాస్ చేయిస్తామని భరోసా కల్పించి వేలాది రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా నగరంలోని ఎల్ .బి. నగర్, రామంతపూర్, ఎస్ .ఆర్. నగర్, జగద్గిరిగుట్ట కేంద్రాలుగా అడ్డగోలు వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లు తెలిసింది.విద్యార్థులు కాపీయింగ్కు పాల్ పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు గీతాంజలి జూనియర్ కాలేజీ యాజమాన్యం ప్రతినిధి బ్రహ్మయ్య ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థుల పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు పారిపోయిన విద్యార్థులను గుర్తించేందుకు పూర్తి స్థాయి దర్యాప్తును చేపడుతున్నారు. బైట్ : నిర్వాహకుడు బైట్: గంగా రెడ్డి, జగద్గిరి గుట్ట ఇన్పెక్టర్ వాయిస్ విద్యను వ్యాపారంగా మార్చి అనర్హులను అందలం ఎక్కించి లక్షలాది రూపాయలను విద్యర్థుల నుంచి సొమ్ము చేసుకుంటున్న గీతాంజలి జూనియర్ కాలేజీ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. పాస్ గ్యారెంటీ ఆశలు చూపించి విద్యార్థులకు జీవితాలతో ఆటలాడుకుంటున్న నిర్వాహకులు నగరంలోని మరో నాలుగు కేంద్రాలలోనూ ఈ విధంగానే మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఈ వ్యవహారం పైన విచారణ జరిపించి నగరంలోని వివిధ కేంద్రాలలో జరుగుతున్న పరీక్షల వివరాలను సేకరించి పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చీకట్లో పరీక్షలు నిర్వహించి ఆశయంతో చదివే విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న యాజమాన్యాన్ని అందుకు సహకరిస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం అధికారులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం డిగ్రీ పీజీ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించాలని ,కానీ పాస్ గ్యారంటీ నీ అమలుచేసేందుకు కాలేజీ యాజమాన్యం తన కాలేజీ కి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పరీక్షలు నిర్వహించడంపై విద్యర్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైట్ :విశ్వనాధ్, విద్యార్థి సంఘం
Last Updated : Dec 14, 2019, 1:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.