నిజాం కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా చలానా తీసుకునేందుకు ఒకే క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో చలానా తీసుకునేందుకు విద్యార్థులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం కళాశాల ప్రిన్సిపల్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది.
ఈ విషయమై బ్యాంక్ అధికారులను సంప్రదించగా... తగినంత సిబ్బంది లేక ఒకే కౌంటర్ ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. అక్టోబర్ 31న ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈనెల 5 వరకు కొనసాగనుంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు