చిన్నతనం నుంచి సేవపట్ల ఉన్న అభిమానంతోనే స్వర్ణ భారత్ ట్రస్ట్ స్థాపించామంటున్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారాల పట్టి దీపా వెంకట్. ఓవైపు ట్రస్ట్ బాధ్యతలు, మరోవైపు ముప్పవరపు సంస్థ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. సేవ చేయాలంటే రాజకీయమొకటే మార్గం కాదని, నాయకుడు కావాలంటే రాజకీయం మాత్రమే వేదిక కాదంటున్నారు. మహిళలు తాము ఏం చేయాలో స్పష్టతతో ఉంటే ఇంటిని, వృత్తిని సమన్వయం చేసుకోవడం సులభమవుతుందంటున్న దీపా వెంకట్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ ముఖాముఖి...
"సేవ చేయడానికి రాజకీయమొకటే మార్గం కాదు" - దీపా వెంకట్‌తో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ
తండ్రి భారత ఉపరాష్ట్రపతి అయినా... ఆమెకు మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదు. చిన్నతనం నుంచి అలవడిన సేవాతత్పరతతో స్వర్ణ భారత్ ట్రస్ట్ స్థాపించిన ఉపరాష్ట్రపతి గారాల తనయ దీపా వెంకట్... ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.