ETV Bharat / state

ఆకాశంలో సగం... ఏదీ హక్కు వినియోగం..?

ఆకాశంలో.. అవకాశాల్లో సగం అని నినదించిన మహిళా లోకం ఓటు హక్కు వినియోగంలో మాత్రం కాస్త వెనుకంజలోనే ఉండిపోయింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ శాతం తగ్గింది. పురుషులతో పోలిస్తే ఓటేసిన అతివల సంఖ్య తక్కువగా ఉంది. మహిళల ఓటుపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. తమ విజయావకాశాలపై ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయమై వార్డులు, బూత్‌లవారీగా విశ్లేషించుకుంటున్నారు.

women voting
ఆకాశంలో సగం... ఏదీ హక్కు వినియోగం..?
author img

By

Published : Dec 3, 2020, 8:09 AM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 వార్డులకుగాను సగం(75) స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేశారు. ప్రధాన పార్టీలన్నీ మహిళలకు సీట్ల కేటాయింపులో పెద్దపీట వేశాయి. కొన్ని పార్టీలు 75 స్థానాలకు మించి టికెట్లు కేటాయించాయి. ఈ దఫా ఎన్నికల్లో స్త్రీలకు ప్రాతినిధ్యం పెరగడంతో.. వారికి మద్దతు ఇచ్చేందుకు మహిళా ఓటర్లు పెద్దఎత్తున ముందుకు వచ్చి ఓటేస్తారని పార్టీలు భావించాయి.

పాతబస్తీలో ఓటింగ్‌కు దూరంగా

నగరంలోని కొన్ని డివిజన్లలో పురుష, మహిళా ఓటర్ల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. పాతబస్తీ పరిధిలోని కొన్ని డివిజన్లలో చాలామంది మహిళలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ● జాంబాగ్‌లో స్త్రీ, పురుషుల ఓటింగ్‌లో తేడా 15 శాతం ఉంది. చాంద్రాయణగుట్టలో పురుషుల ఓటింగ్‌ శాతం 57.32 ఉంటే.. మహిళలు 46.09 శాతం మంది మాత్రమే ఓటేశారు. ఇక్కడ తేడా 11.23 శాతం ఉంది. ● డబీర్‌పురాలో 44.63 శాతం మంది పురుషులు ఓటింగ్‌లో పాల్గొనగా.. మహిళలు 35.58 శాతానికే పరిమితమయ్యారు. రామ్నాస్‌పురా, జహానుమా, శాలిబండ, దూద్‌బౌలి, బార్కాస్‌, పత్తర్‌ఘట్టి, గౌలిపురా, కిషన్‌బాగ్‌, సులేమాన్‌నగర్‌ డివిజన్ల పరిధిలో స్త్రీ, పురుషుల ఓటింగ్‌ శాతంలో తేడా ఏడు నుంచి పదిశాతంగా నమోదైంది. ● భోలక్‌పూర్‌, కాచిగూడ, కాప్రా, చందానగర్‌ డివిజన్లలోనూ వ్యత్యాసం ఐదు శాతం పైనే ఉంది. ఫలక్‌నుమా, నవాబ్‌సాహెబ్‌కుంట, సైదాబాద్‌, రెయిన్‌బజార్‌లోనూ ఇదే పరిస్థితి.

వివరాలిలా...
వివరాలిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.