Telangana Decade celebrations 2023 : అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన కార్యక్రమాల్లో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో జరిగిన వేడుకల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
"ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు నా నియోజక వర్గంలో 9 సంవత్సరాల్లో రూ.520కోట్లు మహిళలకు లోన్ ఇప్పించారు. రంగారెడ్డి జిల్లాలో 12,000 షాపులు పెట్టారు. దీంతో మహిళలను ఆర్ధికంగా అభివృద్ధి చెందారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పాడినందుకు తగిన అభివృద్ధి జరిగిందని సంతోషపడుతున్నాను."- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
- Women Welfare celebrations : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం
- KTR on Women Welfare Celebrations : 'ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశం'
Womens Welfare day in Telangana : సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్ పల్లిలో నిర్వహించిన వేడుకల్లో మహిళా సంక్షేమానికి చేపడుతున్న పథకాల్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ.. మహిళలకు రూ.4కోట్ల వడ్డీలేని రుణాల చెక్‌లను పంపిణీ చేశారు. హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన ఉత్సవాల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా ఆడబిడ్డల నీటి గోస తీర్చలేదని కేసీఆర్ వచ్చాకే ఇంటింటికి తాగునీరు అందుతోందని తెలిపారు.
"తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కొంత మంది కాంగ్రెస్ నాయకులు తొమ్మిదేళ్ల పాలన విఫలం చెందిందని అన్నారు. అలా అయితే కాంగ్రెస్ పాలనలో ఏమి అభివృద్ధి చెందింది. 9 సంవత్సరాల్లో రాష్ట్రంలోని మహిళలు అభివృద్ధి చెందారు. దేశంలో ఏ గవర్నమెంట్ మహిళల సమస్యలను తీర్చలేదు. వారి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో, దుబ్బాక మహిళల అభివృద్ధికి కృషి చేశారు."-హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
Celebrations of Womens Welfare day in Telangana : ఖమ్మంలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య మహిళా సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నారు. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. భద్రాచలం రామాలయం ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఇవీ చదవండి :