ETV Bharat / state

Polavaram: నిధులపై ఇప్పుడు అభ్యంతరాలా?

పోలవరం(Polavaram) నిధులు సహా ఏపీలో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులపై..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ప్రశ్నాస్త్రాలు సంధించుకున్నాయి. సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన పోలవరం(Polavaram) నిధులపై ఇప్పుడు అభ్యంతరాలేంటని... ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రశ్నించగా... మా అనుమతి లేకుండా పోలవరం ఎత్తిపోతలు, టన్నెళ్లు, కాలువల సామర్థ్యం ఎలా పెంచుతారని.. కేంద్ర అధికారులు నిలదీశారు. తెలంగాణ చేపట్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై... సర్వే చేయకుండా... 'రాయలసీమ ఎత్తిపోతల'పై సర్వే చేస్తామనడాన్నీ ఏపీ అధికారులు తప్పుపట్టారు.

debate-on-polavaram-in-delhi
Polavaram: నిధులపై ఇప్పుడు అభ్యంతరాలా?
author img

By

Published : Jun 15, 2021, 8:19 AM IST

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు 2017-18 ధరల ప్రకారం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిన తర్వాతా అభ్యంతరాలు ఎలా లేవనెత్తుతారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను 2005లోనే సిద్ధం చేశామని.. కేంద్రం నిధులిస్తోంది కదా అని ఇప్పుడు కొత్తగా చేర్చినవేమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కేంద్ర జల వనరులశాఖ మంత్రి షెకావత్‌ను కలిసి పోలవరం(Polavaram) డీపీఆర్‌-2ను ఆమోదించాలని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగు సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. దీంతో కేంద్ర మంత్రి సూచన మేరకు దిల్లీలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర జల వనరులశాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సలహాదారు వెదిరె శ్రీరాం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, జాతీయ జల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ భూపాల్‌ సింగ్‌, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ హల్దార్‌, డైరక్టర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, సలహాదారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్‌ ఆమోదం, దానిపై కేంద్ర సంస్థల అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల, గోదావరి- కావేరి అనుసంధానం తదితర అంశాలపై వాడీవేడీ చర్చ జరిగింది. జల వనరులశాఖలో పని చేసిన అనుభవమున్న ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ రాష్ట్రం తరఫున వాదనలను వినిపించారు.

2017-18 ధరల ప్రకారం పెట్టుబడి అనుమతివ్వాలి

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు 2017-18 ధరల ప్రకారం పెట్టుబడి అనుమతి ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. ఎడమ, కుడి కాలువలు, భూసేకరణ, పునరావాసంలో నిధుల కోతపై చర్చ జరిగింది. కాలువల డిశ్ఛార్జి సామర్థ్యంలో కొత్తగా మార్పులు చేశారని, డీపీఆర్‌లో లేని వాటికి నిధులు ఎలా అడుగుతారని కేంద్ర సంస్థల అధికారులు ప్రశ్నించారు. 2005లో డీపీఆర్‌ సమర్పించామని ఏపీ అధికారులు చెప్పారు. అప్పట్లో తాము ఈ ప్రాజెక్టు డిజైన్లను రాష్ట్ర అవసరాల మేరకు ఆకృతుల సంస్థ చీఫ్‌ ఇంజినీరు అనుమతుల ప్రకారమే చేపట్టామన్నారు. కేంద్రం దీనికి ఏఐబీపీ కింద కొంత సాయం చేసిందని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చారని ఆదిత్యనాథ్‌ దాస్‌ గుర్తు చేశారు.

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా వెనక్కి వెళ్లి మార్పులు చేయడం సాధ్యం కాదు కదా అని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్ర నిధుల కోసం డిజైన్‌ డిశ్ఛార్జి మార్చామని ప్రశ్నించడంలో అర్థమేముందని అడిగారు. కేంద్ర జల సంఘం లేవనెత్తిన అనేక అనుమానాలు నివృత్తి చేసిన తర్వాత, 2017-18 ధరలకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలియజేసిన తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ అభ్యంతరాలు లేవనెత్తడమేమిటని ఏపీ అధికారులు ప్రశ్నించారు. పోలవరం అథారిటీ లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు పంపామన్నారు. రెండు రోజుల కిందటే తమకు అందాయని పరిశీలించి కేంద్రానికి పంపుతామని అథారిటీ సీఈవో అయ్యర్‌ చెప్పారు. పెట్టుబడి అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విభాగాల వారీగా పరిశీలిస్తూ బిల్లులు కోత పెట్టకుండా చూడాలని, ఇప్పటికే ఆమోదం పొందిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని నిధులివ్వాలని ఏపీ అధికారులు కోరారు. అందుకు సమర్థనగా నివేదిక పంపితే పరిశీలిస్తామని కేంద్ర అధికారులు భరోసా ఇచ్చారు.

కొత్త జీవోలు ఎలా ఇస్తారు: కేంద్ర అధికారులు

పోలవరం ప్రాజెక్టులో టన్నెళ్ల సామర్థ్యం పెంచాలని భావిస్తున్నారని, కొత్త ఎత్తిపోతల నిర్మించేందుకు జీవోలిచ్చారని.. ఇవన్నీ ఎలా చేస్తారని కేంద్ర అధికారులు ప్రశ్నించారు. గోదావరి నుంచి వరద జలాలు మళ్లించే పనులు ఇప్పుడే చేపట్టవలసి ఉంటుందని, అందుకే ముందస్తుగా ఆమోదం ఇచ్చామని ఆదిత్యనాథ్‌ చెప్పారు. ఆ నిధులు కేంద్రాన్ని అడగడం లేదని, తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇలా ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చుకుంటూ పోతే ఎలా అని కేంద్ర అధికారులు నిలదీశారు. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువ రాష్ట్రాలు నష్టపోతాయని, ఏపీ గోదావరి నదికి చివరన ఉందని.. పోలవరం తర్వాత నీళ్లు నిల్వ చేసుకునే వెసులుబాటు లేదని, సముద్రంలోకి వెళ్లిపోతాయని సీఎస్‌ వివరించారు. ఇతర రాష్ట్రాలతో దీన్ని పోల్చి చూడకూడదన్నారు.

హరిత ట్రైబ్యునల్‌ అలా చెప్పలేదు

రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అనుమతులు ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కృష్ణా బోర్డుకు సూచించిందని అయ్యర్‌ ప్రస్తావించారు. కచ్చితంగా వెళ్లి పరిశీలించి రావాలని తీర్పులో ఎక్కడా లేదంటూ ఏపీ అధికారులు చదివి వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను పది రోజుల్లో సమర్పిస్తామని, కేంద్ర అధికారుల ప్రశ్నలకు సమాధానాలు అందులో ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అంతకన్నా ముందే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం చేపట్టిందని తాము ఫిర్యాదు చేస్తే సందర్శనకు వెళ్లని కృష్ణా బోర్డు.. ఇంకా పనులు ప్రారంభించని రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు వస్తామనడం ఏమిటని ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌ నీళ్లు తెచ్చి తమిళనాడుకు ఇస్తాం: వెదిరె శ్రీరాం

గోదావరి- కావేరి అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, అయితే దిగువ రాష్ట్రమైన ఏపీ నష్టపోకుండా చూడాలని రాష్ట్ర అధికారులు చెప్పారు. గోదావరిలో ఎలాంటి మిగులు జలాలు లేకుండానే కావేరికి నీళ్లు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. డీపీఆర్‌లో పేర్కొన్న లెక్కల్లో, నీటి లభ్యత అంశాల్లో తేడాలు ఉన్నాయన్నారు. పోలవరం నుంచి గోదావరి అనుసంధానం చేపడితే దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోదని చెప్పారు. అయితే పోలవరం నుంచి అనుసంధానం వల్ల ఎక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని, ఇతరత్రా ఇబ్బందులు ఉన్నాయని వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. తాము ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి వారి వాటాలో నీరు తీసుకుని తమిళనాడుకు ఇస్తామని చెప్పారు. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటూ ఉంటే ఇక మిగులు జలాలు ఎక్కడుంటాయని ఏపీ అధికారులు ప్రశ్నించారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కూడా ఈ వాదనతో ఏకీభవించినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అదనంగా ప్రాజెక్టులు కడుతున్నాయని, కేటాయింపుల కన్నా ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టాయనీ ప్రస్తావించారు. గోదావరిలో ఏపీ కూడా కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తోందని.. చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పురుషోత్తపట్నం ఎత్తిపోతలను కేంద్ర అధికారులు ప్రస్తావించారు. చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పాత ప్రాజెక్టులేనని ఏపీ అధికారులు చెప్పారు. తాము ఎప్పుడో పాలనామోదం ఇచ్చామని, తెలంగాణ కేవలం సర్వే కోసం అనుమతులిచ్చి అవి పాత ప్రాజెక్టులే అంటే ఎలా అంగీకరిస్తారని ఆదిత్యనాథ్‌ ప్రశ్నించారు. సర్వేకు మాత్రమే అనుమతులిచ్చినప్పుడు తాను తెలంగాణ జల వనరులశాఖ కార్యదర్శిగా ఉన్నానని ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి: Land Sale : భూముల అమ్మకానికి నేడే నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.