ETV Bharat / state

బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ముగిసిన చర్చ

బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ ముగిసింది. మూడు రోజులుగా 38 పద్దులపై శాసనసభ చర్చ జరిపి ఆమోదించింది. శుక్రవారం ద్రవ్యవినిమయ బిల్లులపై సభ చర్చించనుంది.

Budget Bills in assembly
Budget Bills in assembly
author img

By

Published : Mar 25, 2021, 8:15 PM IST

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాఖల వారీగా పద్దులపై చర్చ ముగిసింది. రెండు రోజులుగా 26 పద్దులపై అసెంబ్లీ చర్చ జరిపి ఆమోదించింది. ఇవాళ మరో 12 శాఖలపై చర్చ జరిపింది. సాగునీటి పారుదల, సాధారణ పరిపాలన, కార్మిక, ఉపాధి కల్పన, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రహదారులు, భవనాలు, విద్యుత్, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై సభ్యులు చర్చించారు.

ఉద్యోగుల వయో పరిమితి పెంపు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులపై కూడా చర్చ జరిగింది. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చ అనంతరం శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

ఇదీ చూడండి: మూసీ ప్రక్షాళనపై ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.