ట్రాన్స్పోర్ట్ వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచడంపై తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేటీసీ రమేష్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రెడ్డి అసోసియేషన్ సభ్యులను కలిశారు.
త్వరలోనే ప్రైవేటు వాహనాలకు ఇసుక రవాణా చేసుకునేందుకు టీఎస్ఎస్డీసీ అనుమతిస్తున్నట్లు తమకు సమాచారం అందించాలని రమేష్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 189 ఉత్తర్వులు జారీ చేయడంపై నంద రెడ్డి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...