దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక గుండ్లపోచంపల్లిలో 2 వారాల క్రితం చంద్రమోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
తీసుకున్న రుణం మొత్తం కట్టేసినా వేధించారని తమ దర్యాప్తులో తేలిందని డీసీపీ పద్మజ వెల్లడించారు. లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వివరాలు నమోదుకు అవకాశం కల్పిస్తారని.. తీసుకున్న నగదుకు 30శాతం అధికంగా వసూలు చేస్తారని డీసీపీ తెలిపారు. తీసుకున్న రుణం కట్టలేకపోతే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తారని... నిందితులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబడుతున్నామని డీసీపీ పద్మజ వెల్లడించారు.
- ఇదీ చూడండి: దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు