ETV Bharat / state

నేడే డీసీసీబీ, డీసీఎంఎస్​ ఛైర్మన్​ ఎన్నికలు - elections

జిల్లా సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెట్ సొసైటీల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. పార్టీఎంపిక చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూసేందుకు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది.అన్ని జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయ్యేలా చూడాలని కేటీఆర్​ పరిశీలకులకు దిశానిర్ధేశం చేశారు.

dccb, dcms elections in telangana
నేడే డీసీసీబీ, డీసీఎంఎస్​ ఛైర్మన్​ ఎన్నికలు
author img

By

Published : Feb 29, 2020, 4:57 AM IST

తెలంగాణలోని జిల్లా సహకారా కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్​ సొసైటీ( డీసీఎంఎస్​)లలో ఛైర్మన్​, ఉపాధ్యక్ష పదవులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదవులన్నీ తెరాస మద్దతుదారులకు దక్కనున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పేర్లను సీఎం కేసీఆర్​కు అందజేయగా ఆయన వాటికి ఆమోదం తెలిపారు.

రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల డీసీసీబీలు, డీసీఎంఎస్​లలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో తెరాస నేతలు ఏకగ్రీవ విజయం ఖాయమని కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని పార్టీ పరిశీలకులకు స్పష్టం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్​ల అధ్యక్షులు, ఉపాధ్యక్ష స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి సీల్డు కవర్​లో శుక్రవారం పార్టీ పరిశీలకులకు ఇచ్చారు. ఇవాళ ఎన్నికకు ముందు తెరిచి ప్రకటించాలని కేటీఆర్ పరిశీలకులకు దిశానిర్ధేశం చేశారు. సామాజిక సమీకరణలు, పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారని.. దానిప్రకారమే ఎన్నిక జరగాలని చెప్పారు. పదవులు ఆశించిన ఇతర డైరెక్టర్లకు భవిష్యత్తులో తగిన అవకాశాలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.

పరిశీలకులు వీరే...

  1. నిజామాబాద్​-మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి
  2. వరంగల్​ -గ్యాదరి బాలమల్లు
  3. ఆదిలాబాద్​-దామోదర్​ గుప్తా
  4. రంగారెడ్డి - ఎంఎస్​ ప్రభాకర్​
  5. నల్గొండ-శేరి సుభాష్​ రెడ్డి
  6. మెదక్​-బడుగుల లింగయ్య
  7. ఖమ్మం-నూకల నరేశ్​ రెడ్డి
  8. మహబూబ్​నగర్​- బండ ప్రకాశ్​
  9. కరీంనగర్​ -ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు
నేడే డీసీసీబీ, డీసీఎంఎస్​ ఛైర్మన్​ ఎన్నికలు

వీరికే అవకాశం

ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ అభ్యర్థులుడీసీఎంఎస్​ అభ్యర్థులు
కరీంనగర్​ ప్రస్తుత టెస్కాబ్​ ఛైర్మన్​ కొండూరి రవీందర్​రావుశ్రీకాంత్​ రెడ్డి
నిజామాబాద్​ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి తనయుడు భాస్కర్​రెడ్డిశ్రీనివాస్​ గౌడ్​
మెదక్​ మెదక్​ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్​ రెడ్డిశివకుమార్​
నల్గొండ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్​ రెడ్డిజానయ్య యాదవ్​
రంగారెడ్డి తెరాస జిల్లా నేత బి.మనోహర్​రెడ్డికృష్ణారెడ్డి
వరంగల్​ తెరాస జిల్లా నేత మార్నేని రవీందర్​రావు రామస్వామి
ఆదిలాబాద్​తెరాస నేతలు భోజారెడ్డి/ రఘునందన్​రెడ్డి/ గోవర్ధన్​రెడ్డిలింగయ్య
మహబూబ్​నగర్​తెరాస నేతలు విష్ణువర్ధన్​రెడ్డి/మనోహర్​/నిజాంపాషాప్రభాకర్​రెడ్డి
ఖమ్మంతెరాస నేతలు రాజశేఖర్​/నాగభూషణం/బ్రహ్మయ్యరాయల శేషగిరిరావు

ఇవీ చూడండి: నలుగురు ఐఏఎస్​ అధికారులకు పోస్టింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.