Daytime Sleepiness Avoid Tips in Telugu : బిజీబిజీగా.. ప్రస్తుత సాంకేతిక యుగంలో గడుపుతున్న ప్రతి మనిషి జీవితానికి నిద్ర చాలా అవసరం. కొందరు నిద్ర లేమితో బాధపడితే మరికొందరు అధిక నిద్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఏది ఏమైనా సగటు జీవికి నిద్ర ఎంత అవసరమో.. అధిక నిద్ర అంతే ప్రమాదం కూడా. అయితే కొందరు మాత్రం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవడం అలవాటుగా మారిపోతుంది. ఇంత వరకు ఓకే గానీ.. ఇది కాస్త మనం పనిచేసే ఆఫీస్, కాలేజీ, స్కూల్లో అలవాటుగా మరిందో చాలా ప్రమాదం.
రా.. రా.. పక్కనే కూర్చో అనే ఫ్రైండ్స్.. మన నిద్ర వారికి ఎక్కడ అంటుతుందోనని దూరంగా వెళ్లమంటారు. అంతేకాదు మరికొందరు ఒక అడుగు వేసి నవ్వుకుంటూ ఎగతాళి కూడా చేస్తారు. దీని వలన మన పరువు పోతుంది సరికదా.. బోనాస్గా ఆ సమయంలో మనం చేయాల్సిన అనేక పనులు సైతం వాయిదా పడతాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టేదెలా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి సింపుల్గా బయటపడొచ్చుంటున్నారు నిపుణులు.
Snoring Remedies : గురక తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
conjunctivitis precautions in Telugu : కళ్ల కలక వచ్చిందా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి
Diseases caused by oversleeping : మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చోవద్దు. కొంత దూరం వాకింగ్ చేయడం.. లేదా ఆఫీస్లో ఉంటే మెట్లు ఎక్కడం చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. దీని వలన మన రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరిగి, శరీరం చురుకుగా ఉంటుంది. దీంతో నిద్రా కూడా దూరం అవుతుంది. అలాగే భోజనం అనంతరం చూయింగ్ గమ్ నోట్లో వేసుకొని నమలండి. దీని వలన నిద్ర దూరమవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూయింగ్ గమ్ నమిలితే ధ్యాస మళ్లడమే కాదు.. ఏకాగ్రతా పెరుగుతుంది. అలాగే పుదీనా వంటివి నోట్లో వేసుకుంటే నోరు తాజాగా ఉంటుంది.
గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా? సమస్యకు పరిష్కారమేంటి?
Sleeping problems : కొందరు మంచి మంచి వంటకాలు చూసి మధ్యాహ్నం భోజనం అతిగా తింటారు. దీని వలన ఆహారం తొందరగా జీర్ణం కాదు. కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. దీని ప్రభావం నిద్ర మీద పడుతుంది. మధ్యాహ్నం సమయంలో సమంగా తినడం ఎంతో శ్రేయస్కరం. మనిషికి భోజనం ఎంత ముఖ్యమో.. నీరు కూడా అంతే అవసరం. భోజనం చేసిన తరువాత తరచూ నీరు తాగుతూ ఉండాలి. దీని వలన ఆహారం కూడా వేగంగా జీర్ణమవుతుంది. బద్ధకం, అలసట పోయి ఏకాగ్రత పెరుగుతుంది. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మకాయ వంటివి నీటిలో కలుపుకొని తాగితే ఇంకా మంచింది.
వర్షాకాలంలో అరికాళ్లల్లో రంధ్రాలు, దుర్వాసన.. ఇలా చేస్తే సమస్యకు చెక్
Sex Stamina Increase Tips : సెక్స్ స్టామినా పెంచుకోవాలా?.. రోజూ గంట వాకింగ్ చేస్తే చాలు!