పంజాగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అంబేడ్కర్ సంఘాలు విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరినా... ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి జవహర్ నగర్ డంప్ యార్డులో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన జీహెచ్ఎంసీ