కరోనా బాధితుల రక్తమాంసాలను పీల్చుకుతింటున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోకుండా కొవిడ్ నిబంధనలు పాటించి… ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన తమపై పోలీసులు కేసులు పెట్టడం ఏమిటని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్(AICC spokesperson dasoju sravan) ప్రశ్నించారు. ఖైరతాబాద్ బడాగణేష్ సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రిని కాంగ్రెస్ సర్కార్ 10 కోట్ల వ్యయంతో నిర్మించిందన్నారు.
50 బెడ్లు సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిని 100 బెడ్ల వరకు పెంచవచ్చని... ఈ ఆసుపత్రిని కొవిడ్ కోసం వాడుకోవాలని తాము చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత వారం కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆ ఆస్పత్రిని సందర్శిస్తే... తమపై ప్రభుత్వం కేసులు పెట్టిందని విమర్శించారు. పాత బస్తీలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెళ్లి వేడుకలో వెయ్యి మంది హాజరైనా, దానికి హోం మంత్రి, డీజీపీలు హాజరైనా ఎలాంటి కేసులు లేవన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలపై కేసులు ఎలా పెడతారని నిలదీశారు.
ఇదీ చూడండి: Governor tamilisai: అమర వీరులకు గవర్నర్ తమిళిసై నివాళి