హైదరాబాద్‌లో మూడు, నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంపేట, పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్కు ప్రాంతాల్లో నగర కమిషనర్ దాన కిశోర్ పర్యటించారు. పరిస్థితిని సమీక్షించి తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశించారు. తడిగా ఉన్న రోడ్లను పూడ్చడానికి ప్రత్యేక మెటీరియల్ వాడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామంటున్న కమిషనర్ దాన కిశోర్‌తో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి.
ఇవీ చూడండి: భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ