ETV Bharat / state

బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన తెరాస అనుబంధ దళిత సంఘాలు - Bandi Sanjay Padayatra Latest News

బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కేపీహెచ్‌బీ నుంచి ప్రారంభమైన యాత్ర కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్దకు రాగానే తెరాస అనుబంధ దళిత సంఘాలు అడ్డుకునేందుకు యత్నించారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్
author img

By

Published : Sep 14, 2022, 6:09 PM IST

భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేపీహెచ్​బీ నుంచి ప్రారంభమైన యాత్ర కూకట్‌పల్లి ఐడీఎల్ ​చెరువు వద్దకు రాగానే తెరాస అనుబంధ దళిత సంఘాలు పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిరసనకు దిగారు. భవనం పేరు విషయంలో కేంద్రం వైఖరి వెల్లడించాలని వారు స్పష్టం చేశారు. లేదంటే సంజయ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు సిద్దమని నినాదాలు చేశారు.

బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన తెరాస అనుబంధ దళిత సంఘాలు

పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన బండి: దిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండి సంజయ్‌ను కలిసిన ప్రజాగాయకుడు గద్దర్ పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతి పత్రం సమర్పించారు. గద్దర్ విజ్ఞప్తిని బండి కేంద్రానికి పంపించారు.

ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత కొనసాగుతోంది. మూడో రోజు హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీ సెంటర్‌ వద్ద మొదలైన యాత్రకు క్షత్రియ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మంగళవారం వీఆర్‌ఏలపై జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ బండి సంజయ్, భాజాపా నాయకులు నల్ల కండువా ధరించి యాత్రలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి: పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్

యడియూరప్పకు షాక్.. 'రూ.కోట్ల స్కామ్'​పై దర్యాప్తునకు కోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.