ETV Bharat / state

'వరద' రాజకీయం...  తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ ఎన్నికల వేళ బాధితులకు అందించే వరద సాయం నిలిపేయటం తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నగరంలోని మీ సేవా కేంద్రాల్లో భారీ ఎత్తున గుమిగూడి ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకుంటున్న తరుణంలోనే పంపిణీ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్ని జారీ చేయటం ఎన్నికల వేడిని మరింత పెంచింది. సాయాన్ని దక్కకుండా చేసింది మీరంటే మీరనే ఇరు పార్టీల పరస్పర విమర్శలతో... రాజధానిలో రాజకీయం మరింత జోరందుకుంది.

తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధం పెంచిన వరద సాయం

author img

By

Published : Nov 19, 2020, 7:55 PM IST

తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధం పెంచిన వరద సాయం

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల్ని ఆదుకోవాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. కుటుంబానికి 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. తొలుత బాధితులకు మంత్రులు, అధికారులు స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. కొన్ని చోట్ల సాయం అందడంలేదని, కొందరికి మాత్రమే సాయాన్ని అందజేశారనే ఆరోపణల నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం... సాయం అందని వారు ఎవరైనా ఉంటే మీ సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రకటించింది.

దీంతో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రజలు నగరంలోని అన్ని చోట్ల మీ సేవా కేంద్రాలకు భారీ ఎత్తున తరలివచ్చారు. నమోదు చేసుకున్న వారికి కొద్ది గంటల్లోనే డబ్బులు ఖాతాల్లో పడుతుండటంతో ఉదయం ఐదంటి నుంచే తోపులాటలు, తొక్కిసలాటలు, ఘర్షణలను భరించి మరీ... నగరవాసులు మీ సేవా కేంద్రాలకు పోటెత్తారు.

కేంద్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు

ఇదే సందర్భంలో జీహెచ్​ఎంసీ షెడ్యూలు విడుదల సందర్భంగా వరదసాయాన్ని కొనసాగించుకోవచ్చని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఒక్కరోజులోనే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద సాయం పంపిణీ ప్రక్రియను నిలిపియాలని ఆదేశించటంతో మీ సేవా కేంద్రాల పరిస్థితి మారింది. ఆశతో నిల్చున్న వారి ఓపిక, ఆగ్రహ రూపం దాల్చింది.

దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మీ-సేవ నిర్వాహకులు నిలిపివేసి, కేంద్రాలను మూసివేయటంతో బాధితులు అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో రకరకాల ప్రచారాలు తెరపైకి రావటం రాజకీయ వేడిని మరింత పెంచింది. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న.. హైదరాబాద్ కోసం, ఇబ్బంది పడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు కానీ... ప్రజలకు సాయం చేస్తుంటే భాజపా బురద రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు.

బండి సవాల్​

వరద సాయం నిలిపివేత గ్రేటర్‌లో తెరాస, భాజపా మధ్య పరస్పర మాటల యుద్ధానికి దారితీసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం సాయం ఆగిందనే ప్రచారం జరగటంతో బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.

ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరారు. వరద సాయాన్ని పెంచాలని డిమాండ్‌ చేశామే తప్ప... ఆపాలని తామెప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. భాజపా ఆరోపణల్ని తిప్పికొట్టిన కేటీఆర్‌... వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం బాధితులకు సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.