ETV Bharat / state

కాంగ్రెస్ వార్​ రూమ్​ కేసు.. మల్లు రవికి పోలీసుల నోటీసులు - congress war room case latest update

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి సైబర్‌క్రైమ్‌ పోలీసుల నోటీసులు

author img

By

Published : Jan 9, 2023, 4:19 PM IST

Updated : Jan 9, 2023, 7:52 PM IST

16:18 January 09

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి సైబర్‌క్రైమ్‌ పోలీసుల నోటీసులు

మల్లు రవికి పోలీసులు ఇచ్చిన నోటీసులు
మల్లు రవికి పోలీసులు ఇచ్చిన నోటీసులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం పట్ల అభ్యంతరకర రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్​క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలును సైబర్​క్రైమ్‌ పోలీసులు ఉదయం విచారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసభ్యకర రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో గత నెల 14న సైబర్​ క్రైమ్‌ పోలీసులు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సునీల్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. అక్కడి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు సునీల్‌ కనుగోలుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌ 30న విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులను సవాల్‌ చేస్తూ.. సునీల్‌ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం సునీల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. పోలీసులు అరెస్టు చేయవద్దని.. 8న సునీల్‌ విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు నిన్న విచారణకు రావాల్సి ఉండగా.. ప్రత్యేక అభ్యర్థనతో ఇవాళ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ముందుకొచ్చారు. నేతలను కించపర్చటంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటం, కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో లభ్యమైన సమాచారం మేరకు పోలీసులు సునీల్‌ను ప్రశ్నించారు. దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.

సునీల్‌ కనుగోలు విచారణ ముగిసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్​పీసీ-41ఏ కింద ఆయనకు పోలీసులు నోటీసులు అందజేశారు. డిసెంబర్‌ 14న కాంగ్రెస్ వార్‌ రూమ్​లో పోలీసుల తనిఖీల సందర్భంగా పార్టీ నేతలతో కలిసి మల్లు రవి ఆందోళనకు దిగారు. ఇది తమ పార్టీ వ్యవహారాలు జరిగే కార్యాలయంగా ఆయన వాదించారు. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి..

ముగిసిన సునీల్​ కనుగోలు విచారణ.. మరోసారి పిలుస్తామన్న సైబర్ క్రైమ్ పోలీసులు

'రూ.35 వేల కోట్ల సర్పంచుల నిధులను రాష్ట్రప్రభుత్వం దారి మళ్లించింది'

Last Updated : Jan 9, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.