హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ నెల 20న మహిళల భద్రత సదస్సును నిర్వహించనున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలతో పాటు సినీనటి సాయిపల్లవి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నామని... ప్రధానంగా మహిళల భద్రతపై మరో అడుగు ముందుకేసి 'షీ సేఫ్' యాప్ ప్రారంభించనున్నట్టు వివరించారు. సుమారు వెయ్యి మంది అధికారులు, పోలీసు సిబ్బంది, ఐటీ ఉద్యోగులు సదస్సుకు హాజరవుతారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి