ETV Bharat / state

సైబర్ నేరాలపై 'దిల్​ సే' పోలీసుల అవగాహన

author img

By

Published : Jan 22, 2021, 5:18 AM IST

రాష్ట్రంలో సైబర్ క్రైం నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలు రకాల నేరాలు అరికట్టడంలో సఫలీకృతమవుతున్న పోలీసులు... సైబర్ నేరాలను మాత్రం నిరోధించలేకపోతున్నారు. రోజుకో కొత్త తరహా నేరం చోటు చేసుకుంటుండటం వల్ల వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 'దిల్ సే' పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సైబర్ నేరాలపై 'దిల్​ సే' పోలీసుల అవగాహన
సైబర్ నేరాలపై 'దిల్​ సే' పోలీసుల అవగాహన

సైబర్ నేరాలపై 'దిల్​ సే' పోలీసుల అవగాహన

అంతర్జాలం వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. విద్య, వ్యాపారం, వినోదం, మానవ సంబంధాల కోసం చాలా మంది అంతర్జాలంపై ఆధారపడుతున్నారు. ఇంకొందరైతే సామాజిక మాధ్యమాల్లో గంటల కొద్దీ సమయం వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలో తెలియకుండానే సైబర్ మోసాలబారిన పడుతున్నారు. ఒక సైబర్ నేరం గురించి ప్రజలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకునే లోపు... మరో రూపంలో మోసం చేస్తున్నారు.

100 శాతం...

2019తో పోలిస్తే 2020లో సైబర్ నేరాలు రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం పెరిగాయి. పట్టణాలు, నగరాల్లో అయితే 200 శాతం పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో అంతర్జాల వినియోగం ఎక్కువ ఉండటమే కారణం. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలను పోలీసులు అరికట్టగలుగుతున్నారు. కానీ సైబర్ నేరాలు మాత్రం నియంత్రించలేకపోతున్నారు.

దిల్ సే...

ఎక్కడో నైజీరియాలో ఉంటూ... బ్యాంకు ఖాతాలో నుంచి నగదును కాజేస్తున్నారు. ప్రజలు సైబర్‌ నేరాల బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు 'దిల్ సే' పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. సమాజంలో సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాలపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 'డిజిటల్ లిట్రసీ టు సెక్యూర్' యూత్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎండ్ నౌ అనే సంస్థ సహాయ సహకారాలు అందిస్తోంది. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

2వేల మంది...

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు దాదాపు 2వేల మంది ఐటీ ఉద్యోగులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళలకు తోడుగా ఉండేందుకు మార్గదర్శక్‌లు సేవలందిస్తున్నారు.

ఆర్నెళ్లపాటు...

ప్రస్తుతం నిర్వహిస్తున్న దిల్ సే కార్యక్రమానికి మొదటి విడతలో 100 మంది ఐటీ ఉద్యోగులను ఎంపిక చేసి... సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా ఎండ్ నౌ సంస్థ నిర్వాహకులు శిక్షణ ఇచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కళాశాలలు, పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పలు సంస్థలకు దిల్ సే వాలంటీర్లు వెళ్లి అవగాహన కల్పిస్తారు. ఆర్నెళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. చిన్నపాటి జాగ్రతలు తీసుకోవడం వల్ల సైబర్ నేరాల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు, దిల్‌సే వాలంటీర్లు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: బస్సు ఛార్జీలు పెంచాలి.. సీఎంకు ఆర్టీసీ వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.