సెకండ్ హ్యాండ్ వస్తువులను తక్కువ ధరకు అమ్ముతామంటూ ఓఎల్ఎక్స్, క్వికర్లాంటి యాప్‌ల్లో వచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చిరిస్తున్నారు. కొనాలనుకున్న వస్తువును చూసి పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే డబ్బులు చెల్లించాలని సూచిస్తున్నారు. ఆన్లైన్లో డబ్బు చెల్లించే పద్ధతి వల్ల నేరస్థులు సులువుగా మోసం చేస్తున్నారని... ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అవగాహన కలిగి పూర్తి అప్రమత్తతతో ఉంటే ఇలాంటి మోసాలను అరికట్టవచ్చన్న సైబరాబాద్ క్రైమ్ డీసీపీతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి : 'ఉన్నత పోస్టుల కోసం పాకులాడలేదు : వీకే సింగ్'