నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్లకు కూకట్‌పల్లి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఇందులో 372 మంది వాహనదారులకు 1 నుంచి 28 రోజుల వరకు జైలు శిక్ష విధించగా, 238 మందికి రూ.15.26లక్షల జరిమానా విధించింది.
లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీవోలకు సూచన
ఇక లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 238 మందికి రూ.6.71లక్షల జరిమానా వేశారు. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 621 మంది వాహనదారులు పట్టుబడ్డారు. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ల వివరాలను ట్రాఫిక్ పోలీసులు రవాణాశాఖకు పంపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాలని ఆర్టీవోలకు సూచించారు.
ఇదీ చూడండి: పట్టుబడిన వారిలో ద్విచక్రవాహనదారులే అధికం