ETV Bharat / state

Fake Currency Gang: 'ఫర్జీ' సీన్ రిపీట్.. ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్టు - Fake Currency thieves Gang Arrest

Fake Currency Gang Arrest in Hyderabad: అతనో ఆర్టిస్ట్.. బొమ్మలు వేయడం ద్వారా వచ్చే సంపాదన సరిపోవడం లేదని ఏకంగా దొంగనోట్లను తయారుచేద్దామని భావిస్తాడు. స్నేహితుడితో కలిసి దొంగనోట్లు తయారుచేసేందుకు కష్టపడతాడు. విఫలం అయినా చివరకు ఆర్బీఐ గుర్తుపట్టలేని విధంగా రూ.500 నోట్లు సిద్ధం చేస్తాడు. ఇదంతా ఫర్జీ సిరీస్ సినిమా కథ. అదేతరహాలో దేశంలోని ఓ అంతరాష్ట్ర నోట్ల ముఠా నాలుగు రాష్ట్రాల్లోని పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. నకీలీ నోట్లు తయారు చేసి దందా నిర్వహిస్తున్న ఆ ముఠాను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

Currency
Currency
author img

By

Published : Apr 26, 2023, 2:43 PM IST

Fake Currency Gang Arrest in Hyderabad : ఐడీబీఐ, ఆదర్శ్‌ బ్యాంకులకు చెందిన నగదును జమ చేసేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు చెస్ట్‌ బ్యాంకులు ఉన్నాయి. ఏటా అక్కడకి వచ్చే నకిలీ నోట్లపై పోలీసులకు.. అధికారులు ఫిర్యాదు చేస్తారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కొన్ని నకిలీ నోట్లపై ఫిర్యాదు చేయడంతో ఏసీపీ శ్యాంబాబు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దింపారు.

బ్యాంకులకు నకిలీ నోట్లు ఇచ్చిన ఖాతాదారుల వివరాలు సేకరించారు. రెండుసార్లకి పైగా నకిలీనోట్లు డిపాజిట్ చేసిన వారిని గుర్తించి విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో నకిలీ నోట్లు చేతులు మారిన వివరాలు సేకరించారు. అనుమాతులపై నిఘా పెట్టగా కొనేటి రాజేశ్​, నీల్‌దాస్‌ను రాయదుర్గంలో అరెస్ట్‌ చేశారు. ఇంటి యజమానికి నకిలీ నోట్లను అద్దెగా ఇచ్చినట్లు గుర్తించారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆసలు కథ వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై, బెంగళూరు, అనంతపూర్, కాకినాడ, గుంటూరు, ప్రకాశం, వరంగల్, మెదక్‌, కరీంనగర్, సంగారెడ్డికి ప్రత్యేక బృందాలను పంపారు.

fake currency notes making: మరో 11 మంది నిందితులను పట్టుకున్నారు. చెన్నైకి చెందిన కీలక నిందితుడు సూరియా సహా మరో ఇద్దరు పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాకి చెందిన కొనేటి రాజేశ్‌ బతుకు తెరువు కోసం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటూనే డ్యాన్స్‌మార్టర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో నేర చరిత్ర ఉన్న రాజేశ్‌ సులభంగా డబ్బు సంపాదించాలని భావించి నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అది గమనించిన కొన్ని ముఠాలు అతడిని సంప్రదించాయి. ఆ సమయంలో రాజేశ్‌కి నీల్‌దాస్‌ పరిచయమయ్యాడు.

సామాజిక మాధ్యమంలోని ఫోన్‌నంబర్ అధారంగా చెన్నైకి చెందిన నకిలీ నోట్ల చలామణి సూత్రధారి సూరియా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రమేశ్‌, చరణ్‌ సింగ్‌ ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. తమ వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని వాటిని చలామణీ చేస్తే రూ.5 లక్షలకు ఒక లక్ష రూపాయాలు ఇవ్వాలని ఒప్పదం కుదుర్చుకున్నారు. వాటి చెలామణికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణలో ఇతర ముఠాలతో ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల 60లక్షల నకీల నోట్లు చెన్నైకి చెందిన సూర్య ద్వారా అందగా.. వాటిలో ఒప్పందం చేసుకున్న ముఠాలకు రాజేష్‌, నీల్‌దాస్‌ పంపారు.

ముఠా సభ్యులు ఆ నోట్లను కిరాణాదుకాణాలు, సంతలు, మద్యందుకాణాలు, పెట్రోల్‌ పంపులు, పాలబూత్‌ల, తుక్కు దుకాణాల్లో రోజుకు పది నోట్ల చొప్పున చలామణీ చేశారు. ఆ క్రమంలోనే పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 30 లక్షలు 68వేల నకీలీనోట్లు, 60వేలనగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల చలామణి విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

ఇవీ చదవండి:

గోల్డ్​ స్మగ్లింగ్​ ఇలా కూడా చేయొచ్చు..!

150 తులాల బంగారం చోరీ.. ఇద్దరు మహిళల అరెస్ట్

కాయ్​ రాజా కాయ్​.. రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్​ బెట్టింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.