కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ విధిగా నిబంధనలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు. క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌లు తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. వైరస్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరారు. సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్‌తో కలిసి.. కొవిడ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ప్లాస్మా, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ప్లాస్మా దాతలు తమ వివరాలను donateplasma.scsc.inలో నమోదు చేసుకోవాలని, ప్లాస్మా అవసరమైన వారు కొవిడ్ కంట్రోల్ కేంద్రం ఫోన్ నంబర్ 9490617440 సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.
ఇవీచూడండి: వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి: బీబీ పాటిల్