సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో టైలరింగ్ సెంటర్, బ్యాండ్ పార్టీ వసతి గదిని సైబరాబాద్ సీపీ సజ్జనార్, అనుప సజ్జనార్ ప్రారంభించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ సిబ్బంది కోరిక మేరకు వారి సౌకర్యార్థం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో 4 కుట్టు మిషన్లతో టైలరింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఎస్‌డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ లక్ష్మి నారాయణ, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సీజే శంకుస్థాపన