ETV Bharat / state

విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు! - police are trying new methods to find cyber criminals

‘హలో అంటూ మాట కలుపుతాడు.. మ్యాట్రిమోనీ సైట్‌లో మీ వివరాలు నచ్చాయంటూ ముగ్గులో దింపుతాడు.. నిన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని..డాలర్లు, బహుమతులు తెస్తున్నానని నమ్మిస్తాడు.. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని దొంగ ఏడుపు ఏడుస్తాడు.. డబ్బు కట్టి విడిపిస్తే తాను తెచ్చిన డాలర్లతో హాయిగా జీవిద్దామంటూ ఉచ్చు బిగిస్తాడు.. ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేయించుకొని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తాడు..’ -సైబర్‌ నేరస్థులు ఈ తరహాలో పలువురు మహిళలను నట్టేట ముంచుతున్నారు. ఇలాంటివారిని కట్టడి చేసేందుకు సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు తొలిసారిగా ప్రయత్నాలను ఆరంభించారు.

cyberabad and rachakonda police are trying new methods to find cyber criminals
విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు!
author img

By

Published : Dec 13, 2019, 1:23 PM IST

సైబర్‌ నేరస్థులు విదేశాల్లో ఉంటున్నట్లు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పేర్లను నమోదు చేసుకొని మహిళలకు వలేస్తున్నారు. లక్ష్యంగా చేసుకున్నవారికి తొలుత వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని.. కట్నం అవసరం లేదని చెప్పి.. ఆశల వలేస్తున్నారు. భారత్‌లోనే స్థిరపడే ఆలోచనతో ఉన్నందున భారీమొత్తంలో డబ్బు, బహుమతులను తెస్తున్నానని నమ్మిస్తున్నారు.

ఆ రోజునే దిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారి పేరుతో సైబర్‌ నేరస్థుల ముఠాలోని సభ్యులే బాధితురాలికి ఫోన్‌ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విదేశీ సొమ్ముతో వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. వదిలిపెట్టాలంటే కొంత మొత్తం కస్టమ్స్‌ సుంకం చెల్లించాలని.. తాము సూచించే బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేయాలని అడుగుతున్నారు.

పెద్ద ఎత్తున సొమ్ము సొంతం కానుందనే ఆశతో ఉండే బాధితురాలికి ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. కొందరైతే వ్యక్తిగత రుణాలు తీసుకొని మరీ అప్పగించేస్తున్నారు. ఎన్నిసార్లు నగదు బదిలీ చేసినా శుభం కార్డు పడకపోయేసరికి అనుమానంతో నిలదీస్తే నేరస్థుల ఫోన్లన్నీ స్విచ్‌ఆఫ్‌ అయిపోతున్నాయి. బాధితులు šపోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు.

రూ.3వేల పెట్టుబడితో బురిడీ

సాధారణంగా మ్యాట్రిమోనీ సైట్లలో ఉచితంగానే పేరు నమోదు చేసుకోవచ్చు. తమ సేవలను పొందేందుకు మాత్రం సంస్థలు 1, 2, 3, 6 నెలలతోపాటు ఏడాది వరకు ప్యాకేజీలను ప్రకటిస్తుంటాయి. ప్యాకేజీ అమల్లో ఉన్నన్ని రోజులు వధువు/వరుడి గురించి సంబంధాలు వెతుక్కునే అవకాశముంది.

ప్రొఫైల్‌ నచ్చితే వారితో మాట్లాడేందుకు ఫోన్‌ నంబర్లను నిర్వాహకులు సమకూర్చుతారు. మోసగాళ్లు మాత్రం ప్యాకేజీ కాకుండా రూ.3వేల ప్రాథమిక రుసుమునే పెట్టుబడిగా పెట్టి బురిడీ వ్యూహాలను రచిస్తున్నారు. పేరు నమోదుకు ఆధారాలు సమర్పించే నిబంధన లేకపోవడం వారికి వరంగా మారుతోంది. వాస్తవానికి నైజీరియన్‌ నేరస్థులు దిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లోనే ఉంటున్నా విదేశాల్లో ఉంటున్నట్లు పేరు నమోదు చేసుకుంటున్నారు. అలా నమ్మించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అమెరికా/కెనడాలో ఉన్నట్లు చూపించేందుకు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌(వీవోఐపీ) ద్వారా కాల్స్‌ చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు. యూకేలో ఉన్నట్లు నమ్మించేందుకు అక్కడి సిమ్‌లను ఇక్కడికి తెచ్చి వినియోగిస్తున్నారు.

ఇదీ నిర్వాహకుల వాదన

పెళ్లి సంబంధాల కోసం తమది వేదిక మాత్రమే అనేది వెబ్‌సైట్ల నిర్వాహకుల వాదన. వధువు/వరుడుల నేపథ్యం గురించి పరిచయమైన తర్వాత వారే తెలుసుకోవాలని చెబుతున్నారు. డబ్బులు తీసుకుంటున్నందున మంచీ చెడు బేరీజు వేయాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని పోలీసులు సూచిస్తున్నారు. మహిళల్ని మోసగించేందుకు నేరస్థులు ఈ వేదికల్ని వినియోగిస్తున్నందున పకడ్బందీ నియంత్రణ ఉండాలనేది పోలీసుల మాట.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.