ETV Bharat / state

గూగుల్​లో చూసి కస్టమర్ కేర్​కు కాల్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే - Frauds of customer care centers

Frauds of customer care centers: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూర్చునే.. ఆన్​లైన్​ షాపిగ్​ చేస్తున్నారు. ఒక్క పాస్​వర్డ్​, ఓటీపీ, ఇంటి అడ్రస్​ ఇచ్చి తమకు కావాల్సిన అంగట్లో సరుకులన్నీ ఇంటి వద్దకే తెచ్చుకుంటున్నారు. రైలు, బస్సు, విమానం రిజర్వేషన్లు ఇంటి నుంచి సులువుగా చేస్తున్నారు. ఈ క్రమంలో మనం కస్టమర్​కేర్​ సెంటర్లను ఆన్​లైన్​లో వెతికామంటే.. సైబర్​ నేరగాళ్ల చేతిలో బలైపోయినట్టే.. ఇటీవల కాలంలో ఇలాంటి నేరాలు వెలుగు చూస్తున్న తరుణంలో సైబర్​ నేరగాళ్ల నుంచి బయటపడటం ఎలాగో ఇప్పుడు చూద్దాం..!

Cyber criminals
Cyber criminals
author img

By

Published : Mar 20, 2023, 12:26 PM IST

Frauds of customer care centers: కొత్తగా మీరు వాషింగ్‌ మెషీన్‌ కొన్నారా..? కొన్ని తర్వాత కొద్దిరోజులకే అది రిపేర్ వచ్చిందా.. అలాగని గూగుల్​లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికితే ఇక మీ పని అంతే. గత కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో నగరంలో సుమారు 200దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి.

పేరు పొందిన సంస్థలను పోలిన నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి.. ఫోన్‌ నంబర్లను సైబర్​ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. హరియాణా, ఝార్ఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్‌ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్‌ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్​లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు.

రూ.8 కోట్లు హాంఫట్‌: హైదరాబాద్​ జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదు కాగా.. బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. మున్ముందు ఇలాంటివి పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం మీరు గూగుల్​లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నంబర్​ను నమ్మొద్దు. అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. సాధారణంగా ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్స్, యూజర్ గైడ్ బుక్స్​, రసీదులపై తమ కస్టమర్ కేర్ నంబర్​ను ప్రింట్ చేసి ఉంచుతుంది. వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలి.

బ్యాంకులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఈ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి. అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, ప్యాడ్‌లాక్‌(తాళం గుర్తు)తో మొదలవుతాయి. ఓ హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆన్​లైన్​లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు. బాధితుడు నుంచి రూ.1. 89లక్షలు కాజేశారు.

యాప్​ డౌన్​లోడ్​ చేయించి.. నిలువు దోపిడి: మరో హైదరాబాద్ వాసి ఆన్​లైన్​లో ఓ వస్తువు కొనుగోలు చేశాడు. అది కాస్త సమయానికి డెలివరీ కాకపోవడంతో కస్టమర్ కేర్​ నంబర్​ కోసం గూగుల్​లో వెతికాడు. కనిపించిన నంబర్​కు కాల్ చేయగా.. అవతలి వ్యక్తి కస్టమర్​తో ఓ యాప్ డౌన్​లోడ్ చేయించాడు. బ్యాంకు ఖాతా నుంచి రూ.99 వేలు సులువుగా కొట్టేశాడు.

ఇవీ చదవండి:

పూజల పేరుతో మహిళల నగ్నచిత్రాలు తీసిన ముఠా అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు

తమ్ముడి కోసం అక్క తాపత్రయం.. ఏకంగా క్వశ్చన్​ పేపర్​ లీక్ చేయించింది

ఆన్​లైన్​లో వలపు వల.. చిక్కితే జీవితాలు విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.