ETV Bharat / state

యాప్ అప్​డేట్ చేయండి అంటూ ఫోన్.. చేశారో అంతే! - హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్‌ మోసాలు

సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ, వాలెట్లను ఉపయోగిస్తున్న ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని నగుదు కొల్లగొడుతున్నారు.

cyber frauds by telling victims to update paytm mobile application
యాప్ అప్​డేట్ చేయండి అంటూ ఫోన్.. చేశారో అంతే!
author img

By

Published : Feb 8, 2020, 7:52 AM IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన రవిశంకర్ చరవాణికి పది రోజుల క్రితం ఒక సందేశం వచ్చింది. పేటీఎం ఉపయోగించుకోవాలంటే వినియోగదారుడి పూర్తి వివరాలు సమర్పించాలనేది దాని సారాంశం. చరవాణీకి వచ్చిన సందేశాన్ని బట్టి రవిశంకర్ ఫోన్ చేసి తనకున్న సందేహాలను అడిగాడు. అవతలి వ్యక్తి సైబర్ మోసగాడు అని తెలుసుకోలేని రవిశంకర్... అతను చెప్పినట్లు చేశాడు. పేటీఎంను అప్​డేట్ చేయడానికి ఎనీ డెస్క్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని ఆ తర్వాత బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలని సైబర్ నేరగాడు సూచించాడు. రవిశంకర్ తన ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో పొందుపర్చడంతోపాటు.... 100 రూపాయల నగదును బదిలీ చేసే ప్రయత్నం చేశాడు. ఖాతాను అప్పటికే హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు.... రవిశంకర్ పేటీఎంకు అనుసంధానమై ఉన్న ఆక్సిస్ బ్యాంకు ఖాతా నుంచి 19 లావాదేవీలు నిర్వహించి రూ.63వేలకు పైగా నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన రవిశంకర్ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పేటీఎం అప్​డేట్ చేయండి అంటూ ఫోన్..

రాంచంద్రాపురంలోని వినాయక్ నగర్‌కు చెందిన ఫక్రుద్దీన్ మహమ్మద్‌కు వారం క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి పేటీఎం అప్​డేట్ చేయడానికి క్విక్ సపోర్ట్ అనే అప్లికేషన్ డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించాడు. నిజమే అని నమ్మిన ఫక్రుద్దీన్ క్విక్ సపోర్ట్ యాప్‌ను డౌన్​లోడ్ చేసుకొని అందులో తన మూడు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు నమోదు చేశాడు. వెంటనే ఫక్రుద్దీన్ మూడు ఖాతాల నుంచి రూ.78వేలకు పైగా నగదు మాయమైంది. తేరుకున్న ఫక్రుద్దీన్ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యూపీఐ ద్వారా అకౌంట్​ను కొల్లగొట్టేస్తున్నారు...

ఆన్​లైన్ నగదు చెల్లింపు సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు సంస్థలు... ఖాతాదారుల సౌలభ్యం కోసం వ్యాలెట్లను, యూపీఐ ఐడీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వినియోగదారులకు వీటిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి మోసగిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాతాదారులకు నేరుగా ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడ్డ నేరగాళ్లు... ఖాతాదారులు అప్రమత్తం అవ్వడం వల్ల యూపీఐ ద్వారా నగదు కొల్లగొట్టేందుకు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు.

వివరాలు మేము ఎప్పుడూ అడగం..

ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలని యూపీఐ ప్రతినిధులుగానీ, బ్యాంకు అధికారులుగానీ ఎప్పుడూ కోరరని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి వచ్చే లింకులను తెరవడంతోపాటు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోను చెప్పొద్దని సూచి‌స్తున్నారు.

యాప్ అప్​డేట్ చేయండి అంటూ ఫోన్.. చేశారో అంతే!

ఇదీ చదవపండిః ఆన్​లైన్​ ఆఫర్లే గాలం... మార్కెట్​లోకి సరికొత్త సైబర్​మోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.