రుణం పేరుతో ఆర్మీ జవాన్‌ను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. బజాజ్ అలియాంజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని... సికింద్రాబాద్ తిరుమలగిరి లాల్బజార్లో ఉన్న ఆర్మీ ఆఫీసులో పనిచేస్తున్న అశ్విన్ కుమార్ అనే జవాన్‌కు సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. నిజమే అనుకొని అతను చెప్పినట్లుగా సంబంధించిన డాక్యుమెంట్‌ను జవాన్ పంపించారు. రుణం కోసం ప్రాసెసింగ్ ఛార్జ్, డాక్యుమెంట్ ఛార్జ్, జీఎస్టీ, పలు పేర్లతో 4 లక్షల 31 రూపాయలు వసూలు చేశాడు.
లోన్ ఎప్పటివరకు వస్తుందని పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడం వల్ల మోసపోయానని గ్రహించాడు. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్మీ ఉద్యోగి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక