ETV Bharat / state

వాట్సాప్​లో చిన్నారుల పోర్న్​వీడియోస్​ వైరల్​.. నిందితుడిని గుర్తించిన అమెరికా దర్యాప్తు సంస్థ - అశ్లీల వీడియోలు

Child porn videos viral in WhatsApp : వాట్సాప్​లో తెలియని నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్​ పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు మార్ఫింగ్ కాల్స్​, స్పామ్ కాల్స్​ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. కొందరు వలపు వల విసురుతూ బ్లాక్​ మెయిల్​ చేస్తూ ఉంటే, మరికొందరు వ్యక్తిగత డేటాను సేకరించి.. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్​లో చిన్నారుల పోర్న్​ వీడియోలు వైరల్ చేస్తున్న ఓ యువకుడిని అమెరికా దర్యాప్తు సంస్థ గుర్తించింది.

WhatsApp Video Call Cyber Crime
WhatsApp Video Call Cyber Crime
author img

By

Published : Jul 12, 2023, 2:32 PM IST

Child porn videos viral in WhatsApp : ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే.. అంతకంటే ఎక్కువగా ఆన్​లైన్​ స్కామ్స్​ పెరిగిపోతున్నాయి. యూజర్​ బేస్ ఎక్కువగా ఉన్న యాప్​లను లక్ష్యంగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్​ నేడు మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యమైన సమాచారాన్ని చిటికెలో అందించడానికి, తెలుసుకోవడానికి ఇది గొప్ప వేదిక అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇదే ఇప్పుడు స్కామ్​లకు, మోసపూరిత కార్యక్రమాలకు అడ్డాగా మారింది.

forwarding child porn videos in Whatsapp : తాజాగా వాట్సాప్‌ ద్వారా హైదరాబాద్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలను వైరల్ చేస్తున్న యువకుడిని అమెరికన్‌ దర్యాప్తు సంస్థ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ (హెచ్‌ఎస్‌ఐ) పట్టించింది. సదరు వ్యక్తి ఫోన్‌ నంబరును గుర్తించి దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. ఈ ఘటనపై అందుకున్న సమాచారం ఆధారంగా రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన యువకుడు (24) భాగ్యనగరంలోని రామంతాపూర్‌లో నివాసముంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి ఐదు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వస్తున్న చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి చూస్తున్నాడు. వాటిని ఇతర గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని అమెరికాలోని హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ గుర్తించింది. వీడియోలు ఫార్వర్డ్‌ చేస్తున్న నంబరును గుర్తించి.. భారత్‌లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది.

అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సీబీఐకి తెలియజేసింది. సీబీఐ తెలంగాణ సీఐడీకి సమాచారం చేరవేసింది. ఈ ఫోన్‌ నంబరు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ బృందంతో దర్యాప్తు చేయించిన సీఐడీ.... నిందితుడు.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉంటున్నట్లు నిర్ధారించుకుంది. తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌కు సూచించింది. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వలలో చిక్కుకుంటే ఆర్థికంగా దోపిడీ : భారత్​లో వాట్సాప్​కు అతిపెద్ద యూజర్​ బేస్​ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆన్​లైన్ మోసగాళ్లు, సైబర్​ నేరగాళ్లు దీనిపై కన్నేశారు. వీరు చేసే స్కామ్​లు చాలా రూపాల్లో ఉంటాయి. ముఖ్యంగా వీరి వలలో చిక్కుకున్నవారిని ఆర్థికంగా దోపిడీ చేస్తారు. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. మరీ ఘోరంగా బాధితుల ఐడెంటీని కూడా తస్కరిస్తారు.

WhatsApp Video Call Scams : 'స్కామర్లు అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిల ప్రొఫైల్​ పిక్చర్స్​తో.. తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు వీడియో కాల్​ చేస్తారు. పొరపాటున వాటిని లిఫ్ట్ చేస్తే, మంచిగా మాటల్లోకి దింపి, మిమ్మల్ని ఆకర్షించే విధంగా న్యూడ్​ ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. కొన్ని సార్లు న్యూడ్​ కాల్స్ చేసేందుకు ప్రోత్సహిస్తారు. అమాయకంగా వారి వలలో పడిన వెంటనే.. దానిని జాగ్రత్తగా రికార్డ్ చేస్తారు. ఇక అప్పటి నుంచి డబ్బులు డిమాండ్​ చేస్తూ, బెదిరిస్తారు. ఇవ్వనంటే, ఆ వీడియోలను బంధువులకు, స్నేహితులకు చూపిస్తామని హెచ్చరిస్తారు. మీరు భయపడి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత, ఇక ప్రతిసారీ మిమ్మల్ని ఆర్థికంగా పీడిస్తూనే ఉంటారు. కనుక ఇలాంటి కాల్స్​ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.' అని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.